ప్రోస్టేట్ క్యాన్సర్ ను ఎలా నిరోధించవచ్చు..?

షేర్ చేయండి:
ప్రోస్టేట్ క్యాన్సర్ ను ఎలా నిరోధించవచ్చు..?

సాక్షి లైఫ్: ప్రోస్టేట్ క్యేన్సర్ ప్రపంచవ్యాప్తంగా మధ్య వయస్కుల్లో, వృద్ధుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్‌ కు చెందిన క్యాన్సర్ రీసెర్చ్ ప్రొఫెసర్ నిక్ జేమ్స్ చెబుతున్నారు. క్యాన్సర్‌ను నిరోధించడానికి, దాని నుంచి ప్రజలను సురక్షితంగా ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అంటున్నారు. 

ఇది కూడా చదవండి.. ఈ వైరస్‌లు.. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవి..  

ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులలో పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఈ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుంది. ఈ విషయంలో వృద్ధులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు.  
 
 అవగాహన అవసరం..  

పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాలను తగ్గించడానికి, దాని నిర్ధారణకు సంబంధించిన కార్యక్రమాలను పెంచాలని, ప్రపంచ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడం అవసరమని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి సురక్షితంగా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో అందరికీ అవగాహన కలించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.  

ప్రపంచవ్యాప్తంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, వృద్ధాప్య జనాభాలో దాని ప్రమాదాలను ఈ అధ్యయనం హెచ్చరిస్తుంది అని క్యాన్సర్ రీసెర్చ్ యూకే డైరెక్టర్ నాసర్ తురాబి చెప్పారు. గత 25 ఏళ్లలో యూకేలో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు సుమారు 150శాతం పెరిగాయి.
  
 ఎలా తగ్గుతుంది..?

ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నిరోధించడానికి నిర్దిష్ట మార్గం లేదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కానీ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం వంటివి చేయడం ద్వారా ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని కొంతమేర తగ్గించవచ్చని వెల్లడిస్తున్నారు. 

బీఎంఐ..  

బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 లేదా అంతకంటే ఎక్కువ బీఎంఐ ఉన్న పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఊబకాయం ఉన్నట్లయితే, బరువు తగ్గడానికి ప్రయత్నించండి. బరువును నియంత్రించడంతోపాటు, పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.