హైప‌ర్‌టెన్ష‌న్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.. 

షేర్ చేయండి:
హైప‌ర్‌టెన్ష‌న్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.. 

సాక్షి లైఫ్ : హైపర్ టెన్షన్ విషయంలో పలురకాల జాగ్రత్తలు పాటించడం ద్వారా హెల్తీ గా ఉండొచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తే చాలావరకూ ఎలాంటి ఇబ్బందులు ఉండవని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. హై బ్లడ్ ప్రెషర్‌.. దీనినే హైప‌ర్‌టెన్ష‌న్‌ అనికూడా అంటారు.

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?  

ఈ  సమస్య వచ్చిందంటే గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెద‌డు సంబంధిత ర‌క్త‌నాళాల్లో ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఎక్కువ‌గా ఉంటాయి. అధిక ర‌క్త‌పోటు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి? ఏం చేస్తే అటువంటి సమస్య నుంచి బయట పడొచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం..   


 వేపుడ్లు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడుల్స్, పిజ్జా వంటి ట్రాన్స్ క్రొవ్వు పదార్థాలను పూర్తిగా మానెయ్యాలి. శ‌రీర బ‌రువును త‌గ్గించుకోవాలి. శ‌రీరానికి ఒత్తిడి, తోపాటు అనవసరంగా ఆందోళన చెందకుండా ఉండాలి. పలురకాల అలవాట్లను మార్చుకోవ‌డం ద్వారా హైప‌ర్‌టెన్ష‌న్‌ను సమస్యను నియంత్రించవ‌చ్చు.

వంట‌ల త‌యారీలో నూనెలు, కొవ్వు ప‌దార్థాల‌ వినియోగం త‌గ్గించాలి. మ‌సాలాలు, కారం వాడ‌కాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఉప్ప వినియోగం చాలా త‌గ్గించాలి. పొగ‌తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం మానుకోవాలి. ప్ర‌తినిత్యం అర్థ‌గంట‌కు త‌క్కువ కాకుండా వ్యాయామం చేయాలి. అంతేకాదు నిల్వ ప‌చ్చ‌ళ్లు, నిల్వ ఉంచిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, క్యాన్డ్‌ ఫుడ్స్‌ పూర్తిగా తగ్గించాలి. 

ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.