భారతదేశంలో పెరుగుతున్న హైపోథైరాయిడిజం, రక్తహీనత సమస్యలు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : భారతదేశంలో హైపోథైరాయిడిజం, రక్తహీనత పెద్ద సమస్యగా మారింది. హైపోథైరాయిడిజం 10 మంది పెద్దలలో ఒకరిని ప్రభావితం చేస్తోంది. హైపోథైరాయి డిజం ఉన్న 41.8శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 15 నుంచి 49 సంవత్సరాల మధ్య మహిళలలో 2015-16లో రక్తహీనత 53శాతం నుంచి 2019-2021లో 57శాతానికి పెరిగింది.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

హైపోథైరాయిడిజం వల్ల థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయలేదు. ఈ హార్మోన్లు శరీర జీవక్రియలను నియంత్రిస్తాయి. శీతాకాలంలో ఈ సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి. శరీరంలో  ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది.

ఈ రెండు పరిస్థితులు ఒకదానితో సంబంధం కలిగి ఉంటాయి. తక్కువ థైరాయిడ్ స్థాయిలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మందగింప చేస్తాయి. దీనివల్ల రక్తహీనత తలెత్తుతుంది. వీటి మధ్య సంబంధం గురించి అవగాహన పెంచడం, సకాలంలో రోగ నిర్ధారణ, సరైన చికిత్స అందించడం చాలా ముఖ్యం.

 అబాట్ ఇండియా మెడికల్ అఫైర్స్ హెడ్ డాక్టర్ రోహిత శెట్టి మాట్లాడుతూ, "హైపోథైరాయిడిజం, రక్తహీనత సమస్యలు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. వీటి గురించి అవగాహన పెంచడంతోపాటు అవసరమైన వారికి వెంటనే చికిత్స అందించడం చాలా అవసరం." అని అన్నారు. 


 కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్  డా. ఏ. మైథిలి మాట్లాడుతూ.. “నేడు, హైపోథైరాయిడిజం, రక్తహీనత వంటి కేసులు బాగా పెరుగుతున్నాయి.    ముఖ్యంగా 15 - 49 సంవత్సరాల మధ్య మహిళల్లో రక్తహీనత 2015-16లో 53శాతం నుండి 2019-2021లో 57శాతానికి పెరిగింది. ఈ రెండు పరిస్థితుల మధ్య సంబంధాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది రోగనిర్ధారణలో సహాయపడుతుంది. తగిన చికిత్సను అందించడం సులభమవుతుంది.” అని చెప్పారు. 


ఎలాంటి వారికి ప్రమాదం ఎక్కువ..? 

గర్భిణీ స్త్రీలు
వృద్ధులు
ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు
పోషకాహార లోపం ఉన్నవారు
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు

 ఎలాంటి వైద్య పరీక్షలు.. చేయించుకోవాలి..? 

థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్.. 
బ్లడ్ కౌంట్, ఫెర్రిటిన్, విటమిన్ B12, ఫోలేట్ స్థాయి పరీక్షలు
ఈ లక్షణాలను ఎదుర్కొంటున్నవారు తగిన పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహాలు తీసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి చిన్న మార్పు కూడా పెద్ద సమస్యగా మారకుండా ముందుగానే జాగ్రత్తగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.