బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా చేయడం ఎందుకు ప్రమాదం..?
సాక్షి లైఫ్ : రాత్రి సమయంలో తిని ఉందయాన్నే నిద్ర లేచిన తర్వాత తర్వాత, శరీర మెటబాలిజం వేగవంతం కావడానికి ,రోజు మొత్తానికి అవసరమైన శక్తిని పొందడానికి పోషకాలు అవసరం. బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యం చేయడం వల్ల శరీరంలోని కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు నెమ్మదిస్తాయి. రాత్రి మొత్తం నిద్ర తర్వాత శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోతాయి.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
జీవక్రియ..
రాత్రి మొత్తం నిద్ర తర్వాత శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోతాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం ద్వారా అవి తిరిగి సమతుల్యం అవుతాయి. బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యం చేస్తే, రోజు మొత్తం శరీరానికి తగినంత శక్తి అందకపోవడంతో అలసట, బలహీనత వంటివి తలెత్తుతాయి.
రక్తంలో చక్కెర..
అల్పాహారం ఆలస్యం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అస్థిరంగా మారుతాయి. ఇది మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
బరువు పెరగడం: ఆలస్యంగా తినడం వల్ల ఆకలి నియంత్రణ దెబ్బతింటుంది. దీనివల్ల ఎక్కువ ఆహారం తినే అవకాశం ఉంటుంది, తద్వారా ఊబకాయం పెరుగుతుంది.
ఏం చేస్తే బెటర్..?
దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే, పలు చిట్కాలను పాటించాలి. సకాలంలో అల్పాహారం: ఉదయం నిద్ర లేచిన ఒకటి లేదా రెండు గంటల లోపు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఉదయం 8 లేదా 9 గంటలలోపు బ్రేక్‌ఫాస్ట్ చేయడం మంచిది.
స్థిరమైన భోజన సమయాలు: బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయాలను స్థిరంగా పాటించాలి. ఇది జీర్ణక్రియ,హార్మోన్ల పనితీరును క్రమబద్ధం చేస్తుంది.
పోషక విలువలకు ప్రాధాన్యత: మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్లు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు, గుడ్లు, ఓట్స్, నట్స్, పండ్లు తినడం ఆరోగ్యకరం. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి.
మంచి నిద్ర: ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా లేవడం వల్ల కూడా భోజన సమయాలు ఆలస్యం అవుతాయి. కాబట్టి, ప్రతిరోజూ స్థిరమైన సమయానికి నిద్రపోవడం, మేల్కోవడం అలవాటు చేసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట తేలికపాటి ఆహారం: రాత్రిపూట ఆలస్యంగా లేదా భారీగా భోజనం చేయడం మానుకోండి. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేయవచ్చు.
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
