Takeaway Food Containers : టేక్‌అవే బాక్స్‌లను ఓవెన్‌లో పెట్టడం ఎంతవరకూ సురక్షితం..?
సాక్షి లైఫ్ : ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేయడం, మిగిలిపోయిన ఫుడ్‌ను ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు అదే ప్లాస్టిక్ డబ్బాలో మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసుకోవడం.. ఇప్పుడు చాలా ఇళ్లలో సాధారణమై పోయింది. సమయం ఆదా చేసుకోవాలనో లేదా బద్ధకం కారణంగానో వేరే గిన్నెలోకి మార్చుకోకుండా నేరుగా టేక్‌అవే బాక్స్‌లనే (Takeaway boxes) ఓవెన్‌లో పెట్టేస్తుంటారు.ఆ డబ్బా మీద 'మైక్రోవేవ్ సేఫ్' (Microwave Safe) అని రాసి ఉండటంతో ఎలాంటి హానీ జరగదని చాలామంది నిశ్చింతగా ఉంటారు. కానీ, ఈ చిన్న పొరపాటు మీ ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు దీనికి సంబంధించిన వాస్తవాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
'మైక్రోవేవ్ సేఫ్' అసలు అర్థం ఏమిటి..?
ఒక కంటైనర్‌పై 'మైక్రోవేవ్ సేఫ్' అని రాసి ఉందంటే.. ఓవెన్‌లో పెట్టినప్పుడు ఆ డబ్బా త్వరగా కరిగిపోదని లేదా దాని ఆకారం కోల్పోదని మాత్రమే అర్థం. అంతేతప్ప, అందులో ఎలాంటి ఆహారాన్నైనా, పదే పదే లేదా ఎక్కువసేపు వేడి చేయడం సురక్షితం అని కాదు. ఆ లేబుల్ కేవలం ఆ డబ్బా వేడిని ఎంతవరకు తట్టుకోగలదో మాత్రమే సూచిస్తుంది. ఇది వంద శాతం భద్రతకు హామీ ఇవ్వదు.
టేక్‌అవే బాక్సులను పదే పదే వాడొచ్చా..?
లేదనే చెప్పాలి. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీకి వాడే చాలా డబ్బాలు కేవలం ఒక్కసారి వాడి పారేసేలా (Single-use) తయారు చేసినవి. అలాంటి ప్లాస్టిక్ డబ్బాలను పదే పదే ఓవెన్‌లో పెట్టి వేడి చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఒకవేళ డబ్బాపై 'మైక్రోవేవ్ సేఫ్' గుర్తు లేకపోతే, అందులో ఆహారాన్ని వేడి చేయడానికి బదులుగా గాజు లేదా సిరామిక్ గిన్నెలోకి మార్చుకోవడం ఉత్తమం.
ఓవెన్‌లో ఆహారాన్ని వేడిచేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఆహారాన్ని వేడి చేసేటప్పుడు మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి..
లేబుల్ తనిఖీ..మైక్రోవేవ్‌లో పెట్టే ముందు కంటైనర్‌పై 'మైక్రోవేవ్ సేఫ్' గుర్తు ఉందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయండి.
గుర్తులు లేనివి వాడొద్దు..ఎలాంటి లేబుల్ లేదా గుర్తు లేని ప్లాస్టిక్ డబ్బాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవెన్‌లో పెట్టకండి.
సమయం ముఖ్యం.. ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని ఎక్కువసేపు (Long duration) వేడి చేయడం మంచిది కాదు.
పారేయడం ఉత్తమం.. ప్లాస్టిక్ డబ్బా రంగు మారినా, కరుగుతున్నట్లు అనిపించినా లేదా పగుళ్లు వచ్చినా.. దానిని వెంటనే పారేయండి. మళ్లీ వాడకండి.
సరైన పాత్రల ఎంపిక..మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేయడానికి ప్లాస్టిక్ కంటే గాజు (Glass) లేదా మైక్రోవేవ్-సేఫ్ సిరామిక్ (Ceramic) పాత్రలు వాడటం అత్యంత సురక్షితం.
అత్యంత సురక్షితమైన మార్గం..
టేక్‌అవే బాక్స్‌ల భద్రతపై మీకు ఏమాత్రం సందేహం ఉన్నా, అందులో ఆహారాన్ని నేరుగా వేడి చేయకండి. ఫుడ్‌ను ముందుగా గాజు లేదా సిరామిక్ పాత్రలోకి మార్చుకుని ఆ తర్వాతే వేడి చేసుకోండి. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యంత సులభమైన, సురక్షితమైన మార్గం.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
