Jamun Seeds : పారేయకండి.. నేరేడు గింజలతో అద్భుత ఆరోగ్యప్రయోజనాలివే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వర్షాకాలం రాగానే మార్కెట్లో నేరేడు పండ్లు విరివిగా సందడి చేస్తుంటాయి. తీపి, వగరు కలగలిసిన రుచితో నోరూరించే ఈ కాలానుగుణ పండ్లను ఇష్టపడని వారుండరు. నేరేడు పండ్లతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అందరికీ తెలిసిందే. అయితే, పండ్లు తిన్నాక చాలామంది వాటి గింజలను పనికిరావని చెత్తబుట్టలో పారేస్తుంటారు. కానీ, ఆయుర్వేదం ప్రకారం నేరేడు గింజల్లో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

 

నేరేడు గింజలతో ముఖ్యమైన లాభాలు.. 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నేరేడు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ (fiber), అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. సాంప్రదాయ వైద్యంలో వీటిని ఏళ్ల తరబడి ఉపయోగిస్తున్నారు.

మధుమేహానికి చెక్..

 ఆయుర్వేదంలో నేరేడు గింజల పొడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులోని కొన్ని సహజసిద్ధమైన సమ్మేళనాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, దీన్ని మధుమేహం మందులకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. షుగర్ వ్యాధిగ్రస్తులు వైద్యులను సంప్రదించిన తర్వాతే దీన్ని వినియోగించాలి.

జీర్ణవ్యవస్థకు మేలు..

ఈ గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నివారణకు ఇది చక్కగా పనిచేస్తుంది. మితంగా తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్ల గని..

 నేరేడు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాలకు నష్టం వాటిల్లకుండా రక్షిస్తాయి. దీనివల్ల వృద్ధాప్య ఛాయలు దరిచేరవు.

రోగనిరోధక శక్తి ..

 పోషకాలు, ఔషధ గుణాల కలయికైన నేరేడు గింజలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. సమతుల్య ఆహారంతో పాటు దీన్ని తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

బరువు నియంత్రణ..

ఈ గింజల్లో ఉండే పీచుపదార్థం వల్ల కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో పదే పదే ఆకలి వేయదు. ఫలితంగా అతిగా తినడాన్ని అరికట్టి, బరువును సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.

ఎలా వాడాలి..?

పండ్లు తిన్న తర్వాత నేరేడు గింజలను శుభ్రంగా కడిగి, ఎండలో బాగా ఆరబెట్టాలి. అవి పూర్తిగా ఎండిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని చిటికెడు తీసుకుని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగొచ్చు. ఈ పొడి మోతాదు అనేది తీసుకునే వ్యక్తి వయసు, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వైద్యులు లేదా ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోకుండా అధిక మోతాదులో వినియోగించకూడదు.

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.