Zinc Deficiency : వాసన రావడం లేదా..? అయితే అది 'జింక్' లోపానికి సంకేతం..!

సాక్షి లైఫ్ : మనం రుచిని, వాసనను గుర్తించడంలో మన ఘ్రాణ వ్యవస్థ (Olfactory System) కీలకపాత్ర పోషిస్తుంది. కొన్నిసార్లు జలుబు లేదా వైరల్ ఇన్‌ఫెక్షన్ల కారణంగా తాత్కాలికంగా వాసన శక్తిని కోల్పోవడం (Anosmia) జరుగుతుంది. అయితే, ఎలాంటి జలుబు లక్షణాలు లేకుండానే రుచి, వాసన గుర్తించలేకపోతుంటే, మీ శరీరంలో జింక్ (Zinc) అనే కీలకమైన ఖనిజం లోపించిందనడానికి అది హెచ్చరిక కావచ్చు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?  

 

శరీరంలో రోగనిరోధక శక్తి (Immunity) పెంపొందించడం నుంచి కణాల విభజన వరకు జింక్ అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ముఖ్యంగా రుచి, వాసన గ్రాహకాలు (Taste and Smell Receptors) సరిగ్గా పనిచేయడానికి జింక్ తప్పనిసరి.

జింక్ లోపం.. వాసన కోల్పోవడం వెనుక అసలు కారణం.. 

జింక్, మన రుచి, వాసన వ్యవస్థల్లో రెండు ప్రధాన విధులు నిర్వహిస్తుంది. 
 వాసనను గుర్తించే నరాల కణాలు (Nerve Cells) మెదడుకు సంకేతాలను పంపడానికి జింక్ అవసరం. ఈ ఖనిజం లోపించినప్పుడు, ఆ సంకేతాలు సరిగా ప్రసారం కాక, వాసన శక్తి మందగిస్తుంది.

కణాల పునరుత్పత్తి.. 

రుచి, వాసనను గ్రహించే కణాలు త్వరగా క్షీణిస్తాయి, వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి. ఈ కణాల పునరుత్పత్తి ప్రక్రియలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. జింక్ లోపిస్తే ఈ కణాల నిర్మాణం ఆగిపోయి, రుచి, వాసనలను గుర్తించే సామర్థ్యం తగ్గుతుంది.

 
వాసన పట్టలేకపోవడంతో పాటు ఈ కింది లక్షణాలు కనిపిస్తే, జింక్ లోపాన్ని అనుమానించి వైద్యుడిని సంప్రదించాలి.. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల తరచుగా జలుబు, ఫ్లూ రావడం. గాయాలు త్వరగా మానకపోవడం.. చిన్న గాయాలు కూడా మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం.

జుట్టు రాలడం (Hair Loss).. అసాధారణంగా జుట్టు ఎక్కువగా రాలడం.
ఆకలి మందగించడం..రుచి సరిగా తెలియకపోవడం వల్ల ఆకలి తగ్గడం.

జింక్ లోపాన్ని ఎలా అధిగమించాలి..?

లోపాన్ని గుర్తించిన తర్వాత, వైద్య నిపుణుల సలహా మేరకు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా జింక్ స్థాయిలను పెంచుకోవచ్చు. జింక్ అధికంగా ఉండే ఆహారం.. గుమ్మడి గింజలు, నువ్వులు, పప్పు ధాన్యాలు, మాంసం, గుడ్లు, కొన్ని రకాల సీ ఫుడ్స్‌లో జింక్ పుష్కలంగా ఉంటుంది. లోపం తీవ్రంగా ఉంటే, డాక్టర్ సూచన మేరకు జింక్ సప్లిమెంట్లను తీసుకోవాలి.

వాసన కోల్పోవడం అనేది తాత్కాలిక సమస్యే కావచ్చు, కానీ దీర్ఘకాలంగా కొనసాగితే అది మీ పోషకాహార లోపానికి లేదా అంతర్గత ఆరోగ్య సమస్యలకు సంకేతం కాబట్టి అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : zinc-deficiency taste-buds zinc signs-of-zinc-deficiency zinc-deficiency-symptoms zinc-benefits zinc-deficiency-warning-signs zinc-health-impact health-benefits-of-zinc benefits-of-zinc best-sources-of-zinc zinc-rich-foods
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com