ఇలా చేస్తే.. బీపీని నియంత్రించవచ్చు..   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: హైపోటెన్షన్ అనేది తీవ్రమైన సమస్య. అయితే దానిని నుంచి  బయటపడటం కష్టమేమి కాదు. తీసుకునే ఆహారం, జీవనశైలిని మార్చుకోవటం ద్వారా, లో బీపీ సమస్యను సులభంగా నివారించవచ్చు. అందుకోసం ఏం చేయాలి..? ఏం చేయకూడదంటే..?  

-తగినంత నీరు తాగాలి. 
-ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. 
-క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
-ఆల్కహాల్, పొగత్రాగడం వంటి అలవాట్లు ఉంటే మానుకోండి. 
-ఇతర మందులు తీసుకుంటుంటే, వాటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి డాక్టర్‌ ను సంప్రదించండి. 
-ఆహారంలో ఉప్పు తగ్గించండి. 
-కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు భోజనం చేయండి. 

లో బీపీ వస్తే ఏం చేయాలి..?

రక్తపోటులో ఆకస్మిక తగ్గుదలకు సరైన చికిత్స అవసరం. ఆ సమయంలో స్వీయ చికిత్స కంటే ఆసుపత్రిని సందర్శించడం మంచిది. ఒక గంటలోపు ఆసుపత్రికి రావడం వల్ల ప్రమాదకర పరిణామాలను నివారించవచ్చు. 

అక్కడ లోబీపీకి కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తారు. మనం పైన చెప్పుకున్నట్టుగా... లోబీపీ లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు మీ జీవనశైలిని సరిచేసుకోవాలి. తగిన పోషకాహారం, తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరిగా మీ దినచర్యలో చేర్చుకోవాలి.  

సైంధవ లవణం.. 

లోబీపీతో కళ్లు తిరిగి పడిపోవడం, మైకం కమ్మినప్పుడు వెంటనే ఒక గ్లాస్‌ నీటిలో అర టీస్పూన్‌ సైంధవ లవణం కలుపుకొని తాగితే బీపీ వెంటనే నార్మల్‌ అవుతుంది. ఇది టేస్ట్‌లో కొంచెం ఉప్పగా, తీపిగా ఉంటుంది.సైంధవ లవణంలో పొటాషియం అధికంగా ఉంటుంది. 

ఇది బీపీని కంట్లోల్‌ చేసి, నార్మల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. మన శరీరానికి కావాల్సిన  కాల్షియం, కాపర్‌, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సల్ఫర్‌, జింక్‌, అయోడిన్‌, ఆక్సిజన్‌ వంటి అనేక పోషక విలువలు సైంధవ లవణంలో ఉన్నాయి.

ఇది కూడా చదవండి.. సర్వైకల్‌ క్యాన్సర్‌ కు ఉచితంగా వ్యాక్సిన్..   
 
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.