సాక్షి లైఫ్: మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి.. నిన్నటికి నిన్న కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్... పిన్న వయసులోనే గుండెపోటుతో కుప్పకూలి మరణించిన వారు వీరు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే ఎదురవుతున్నాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాడుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు తగు మోతాదులో రక్తం అందకపోవడం వల్ల గుండెపోటు వస్తుందని మనకు చాలాకాలంగా తెలుసు. సాధారణంగా గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కానీ కొంతమందిలో మాత్రం లక్షణాలేవీ కనిపించవు కూడా. ఈ కారణం వల్లనే గుండె సమస్యల విషయంలో ప్రతిఒక్కరికి కొంత అవగాహన అవసరమని అంటున్నారు నిపుణులు.
రెండు అంతస్తుల మెట్లు ఎక్కడంతోనే ఎగశ్వాస... ఛాతిలో మునుపెన్నడూ లేని రీతిలో నొప్పి, ఛాతి మధ్యలో మొదలైన నొప్పి ఎడమై చేయి గుండా వ్యాపిస్తూండటం.. అకస్మాత్తుగా విపరీతంగా చెమటలు పట్టడం, కళ్లు తిరిగినట్లు అనిపించడం వంటివి గుండె రక్తనాళాల్లో అడ్డంకులను సూచించే కొన్ని లక్షణాలు. కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు అయితే గుండె సమస్యకు సంబంధించిన లక్షణాలు భిన్నంగా ఉంటాయని వైద్యులు చెబుతారు. అందుకే పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మేలని సూచిస్తున్నారు.
హార్ట్ బ్లాకేజీలకు కారణం..?
రక్తనాళాల గోడలపై కొవ్వు పేరుకుపోవడం వల్ల అడ్డంకులు ఏర్పడుతూంటాయి. కొంత కాలం తరువాత ఈ కొవ్వు కాస్తా గట్టి పడుతూంటుంది. దీన్నే ప్లాక్ అని అంటారు. కొలెస్ట్రాల్, కొవ్వు, కాల్షియం, ఫైబ్రిన్‌లతోపాటు కణాలకు సంబంధించిన వ్యర్థాలతో కూడి ఉంటుంది ఈ ప్లాక్. ఇలా ప్లాక్ పేరుకుపోయిన ప్రాంతంలో రక్త సరఫరాకు ఇబ్బంది ఏర్పడుతూంటుంది. బరువు ఎక్కువగా ఉండటం, పిండిపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, మద్యపానం, మధుమేహం వంటివి రక్తనాళాల్లో ప్లాక్ ఏర్పడేందుకు, పెరిగిపోయేందుకు కారణాలు. రక్తనాళాల్లో ప్లాక్ పెరిగిపోయి సరఫరాను అడ్డుకోవడాన్ని వైద్య పరిభాషలో అథెరెస్కెలరోసిస్ అని పిలుస్తారు.
ఈ లక్షణాలు కనిపిస్తే హార్ట్ లో బ్లాక్స్ ఉన్నట్లే..
ఎక్కువ అలసిపోయినట్లు అనిపిస్తుంది.
ఛాతీలో అసౌకర్యంగా ఉంటుంది.
ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు లేదా వేగంగా నడుస్తున్నప్పుడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది.
తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
గుండె ను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు..
చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల రూపంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి మీ రక్తపోటును తగ్గిస్తాయి.
ఆలివ్ ఆయిల్ - ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది మీ రక్త నాళాలను బలోపేతం చేస్తుంది. మీ కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి ఆలివ్ ఆయిల్ తీసుకోవడం ఉత్తమం.
వాల్‌నట్‌లు, బాదంపప్పులు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మీ గుండె ధమనులను మంట నుంచి కాపాడుతుంది. వాల్ నట్స్ లో కూడా ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది.
సిట్రస్ పండ్లు - ఈ సిట్రస్ పండ్లలో మంచి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో లేదా తగ్గించడంలో సహాయపడుతాయి.
అవోకాడో - మీ కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే ఆరోగ్యకరమైన కొవ్వులకు ఇది గొప్ప మూలం.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com