పిల్లలలో థైరాయిడ్ సమస్యలకు ప్రధాన కారణాలు..?
సాక్షి లైఫ్ : పిల్లలలో థైరాయిడ్ సంబంధిత సమస్యలు ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్నాయి. ఈ సమస్యలు ప్రధానంగా థైరాయిడ్ గ్రంథి తక్కువ హార్మోన్లు ఉత్పత్తి చేయడం వల్ల తలెత్తే సమస్య. దీనినే "హైపోథైరాయిడిజం" అని అంటారు. అధిక హార్మోన్లు ఉత్పత్తి చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యను "హైపర్‌థైరాయిడిజం" అని అంటారు.
ఇది కూడా చదవండి..స్ట్రోక్ ప్రమాదాన్ని కలిగించే 4 ఆహార పదార్థాలు..
ఇది కూడా చదవండి..ఎలాంటి వారిపై షింగిల్స్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..?
చాలా మంది చిన్నారుల్లో థైరాయిడ్ సమస్య పుట్టుకతోనే వస్తోంది. అంతే కాకుండా బిడ్డ నెలలు నిండకుండా పుడితే కూడా కొందరిలో థైరాయిడ్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను నివారించడానికి, తల్లి గర్భం నుండే బిడ్డకు సరైన పోషకాహారాన్ని అందించాలని వారు సూచిస్తున్నారు.
హషిమోటో థైరాయిడిటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా థైరాయిడ్‌కు కారణం కావచ్చు. అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ ప్రోబ్లమ్స్ తలెత్తుతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది శరీరం రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధిని దెబ్బతీయ డం ప్రారంభించే పరిస్థితి. తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డకు సరైన పోషకాహారం అందకపోతే థైరాయిడ్ సమస్యలు రావచ్చు.
థైరాయిడ్ సింటమ్స్ ఎలా ఉంటాయి..?
- పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల తగ్గుతుంది
-పిల్లలు అలసిపోయినట్లు అనిపిస్తుంది
-త్వరగా అనారోగ్యానికి గురవుతారు
- పిల్లల చర్మం పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది
ఎముకలు, జుట్టు, దంతాలు బలహీనమవుతాయి
-మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.
- ఊబకాయం సమస్య.
-థైరాయిడ్ గ్రంధి పరిమాణం పెరగడం.
-కళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం.
చికిత్స..?
-మొదట పిల్లలలో థైరాయిడ్ లక్షణాలను గమనించిన వెంటనే తల్లిదండ్రులు ఖచ్చితంగా సంబంధిత వైద్యుడిని సంప్రదించాలి.హైపోథైరాయిడిజం ఉన్న పిల్లలకు, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చికిత్స చేస్తారు. అంతే కాకుండా కొన్ని మందుల ద్వారా కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న పిల్లల చికిత్స కోసం, మందులు, శస్త్రచికిత్సలు చేస్తారు.దీన్ని నివారించాలంటే సరైన వైద్యంతో పాటు పౌష్టికాహారంపై కూడా శ్రద్ధ పెట్టాలి. పుట్టుకతో వచ్చే థైరాయిడ్ వ్యాధిని గుర్తించేందుకు, పుట్టిన కొద్ది రోజుల్లోనే పిల్లల టీ.ఎస్.హెచ్ పరీక్ష చేయించాలి. థైరాయిడ్ కారణంగా పిల్లల శారీరకంగానే కాకుండా మానసిక ఎదుగుదలపై కూడా ప్రభా వం చూపిస్తుంది.
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు..
ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
