ఎలాంటి వ్యాధుల నిర్మూలనకు త్రిఫల చూర్ణం పనిచేస్తుంది..?   

షేర్ చేయండి:
ఎలాంటి వ్యాధుల నిర్మూలనకు త్రిఫల చూర్ణం పనిచేస్తుంది..?   

సాక్షి లైఫ్ : రోగనిరోధక శక్తిని పెంచడం దగ్గర నుంచి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడం వరకు, త్రిఫల చూర్ణంతో లెక్కలేనన్ని ప్రయోజ నాలున్నాయి. ఆయుర్వేదంలో చాలా తీవ్రమైన వ్యాధుల చికిత్సలో సహాయపడే అనేక మందులు ఉన్నాయి. అందులో ఒకటి త్రిఫల చూర్ణం. దీనిని దివ్యౌషధంగా భావిస్తారు. మలబద్ధకంతో బాధపడేవారు త్రిఫల చూర్ణం తప్పనిసరిగా తీసుకోవాలి. అంతే కాకుండా బరువు తగ్గడంతో పాటు చర్మానికి కూడా ఇది మేలు చేస్తుంది.


ఇది కూడా చదవండి.. B12 విటమిన్ లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..?

ఇది కూడా చదవండి..రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సూపర్‌ఫుడ్స్..?

ఇది కూడా చదవండి..ఆడవాళ్ళలో కంటి సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన గుండె కోసం ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం అంటే..? 

ఇది కూడా చదవండి..మీ లివర్ పాడైతే శరీరంలో కనిపించే సింటమ్స్ ఇవే.. 

 

 త్రిఫల చూర్ణంను పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో పలురకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మలబద్దకానికి దివ్యౌషధం. ముఖ్యంగా దీర్ఘకాలిక మలబద్ధకాన్ని నయం చేయడంలో ఇది సహాయపడుతుంది. రోజూ త్రిఫల చూర్ణం తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చని ఆయుర్వేదవైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అంతే కాకుండా త్రిఫల చూర్ణం తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.  


జీర్ణవ్యవస్థకు మేలు.. 

త్రిఫల చూర్ణం జీర్ణ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. సాఫీగా విరోచనం అయ్యేలా చేస్తుంది. తద్వారా కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఇది కడుపు లోపలి పొరను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. వాపును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. త్రిఫల చూర్ణం కడుపులో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే మూలికా గుణాలు ఫైబర్ కలిగి ఉంటాయి, ఇవి జీర్ణక్రియ ఏజెంట్లు గా పనిచేస్తాయి. ఇవి మలబద్ధకం రాకుండా నిరోధిస్తాయి.

రోగనిరోధక శక్తి..  

త్రిఫల చూర్ణం మూలికా ఔషధంగా పనిచేస్తుంది. ఇది ఎలాంటి  ఇన్ఫెక్షన్‌ను అయినా నివారిస్తుంది. ఇందులో ఉండే అద్భుతమైన పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. రోగనిరోధక శక్తి పెరగడంవల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
అంతేకాదు త్రిఫల చూర్ణం అన్ని చర్మ సంబంధిత సమస్యలను అంతమొందిస్తుంది. 

బరువును నియంత్రణ..  

త్రిఫల చూర్ణం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మొటిమలను నివారించడంలోనూ చర్మాన్ని అందంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.
కడుపును, జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి త్రిఫల చూర్ణం చాలా బాగా పనిచేస్తుంది. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.

 

ఇది కూడా చదవండి..డయాబిటిస్ రిస్క్ ఎలాంటివాళ్లకు ఎక్కువ..?

ఇది కూడా చదవండి..హెపటైటిస్ బి, సి ప్రాణాంతకమా..?

ఇది కూడా చదవండి..నూతన అధ్యయనం : పసుపులో విషపూరిత పదార్థాలు..

ఇది కూడా చదవండి..అవిసె గింజలతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.