ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్‌ను జయించి, నవజ్యోత్ కౌర్ సిద్ధూ పూర్తిగా ఎలా కోలుకున్నారో తెలుసా..?

సాక్షి లైఫ్ : ప్రముఖ రాజకీయ నాయకుడు, క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూ, ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్‌ను జయించగలిగారు. ఆమె ఈ మహమ్మారిని అధిగమించడంలో ఎలాంటి ఆహారపు అలవాట్లు, ఎలాంటి జీవనశైలిని అనుసరించారనే విషయాలు మీడియా సమావేశంలో వెల్లడించారు. కేవలం జీవనశైలిలో మార్పులు, పలురకాల ఆహారపు అలవాట్లతో నవజ్యోత్ కౌర్ సిద్ధూ నాలుగో దశ క్యాన్సర్ నుంచి ఎలా బయట పడగలిగారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

ఆమె క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, దీర్ఘకాలిక వైద్య చికిత్సలు క్యాన్సర్ నుంచి బయటపడడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఆమె  ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స తీసుకోవడం కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయని నవజ్యోత్ సింగ్ సిద్ధూ వెల్లడించారు. క్యాన్సర్, ఫ్యాటీ లివర్ వ్యాధి వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని ఆయన కోరారు.

 

https://x.com/sherryontopp/status/1859626801611305413

 

ఇది కూడా చదవండి.న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 

 నవజ్యోత్ కౌర్ సిద్ధూకు క్యాన్సర్ పూర్తిగా నయమైందని నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురువారం ప్రకటించారు. అమృత్‌సర్‌లోని వారి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆమె బతికే అవకాశం 3శాతం మాత్రమే ఉన్నప్పటికీ స్టేజ్ ఫోర్త్ క్యాన్సర్‌ను అధిగమించినట్లు వెల్లడించారు.

ఏడాది కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న నవజోత్ కౌర్ ఆ వ్యాధిని దృఢ సంకల్పంతో ఎదుర్కొంది. ఆమెకు చికిత్స అందించే దశలో వైద్యులు మొదట్లో ఎలాంటి ఆశలు పెట్టుకున్నారో సిద్ధూ గుర్తు చేసుకున్నారు. "తమ కుమారుడి పెళ్లి తర్వాత ఆమెకు క్యాన్సర్ వచ్చిందని, ఆమె ఈ వ్యాధి నుంచి బయటపడాలనే ధృఢసంకల్పమే క్యాన్సర్ ను ఓడించగలిగిందని ”అని ఆయన వివరించారు.

పాటియాలాలోని ప్రభుత్వ రాజేంద్ర మెడికల్ కాలేజీతో సహా ప్రభుత్వ ఆసుపత్రులలో తన భార్య చాలా వరకు చికిత్స పొందిందని, అందుకోసం కేవలం కొన్ని లక్షలు మాత్రమే ఖర్చు చేశామని సిద్ధూ వెల్లడించారు. "ఆమె క్యాన్సర్‌ను ఓడించింది మా దగ్గర డబ్బు ఉన్నందువల్ల కాదు, ఆమె క్రమశిక్షణతో, కఠినమైన దినచర్యను అనుసరించడంవల్లే ఇది సాధ్యమైందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా క్యాన్సర్‌కు సమర్థవంతంగా చికిత్స చేస్తారని ’’ అని ఆయన ఉద్ఘాటించారు.


నవజోత్ కౌర్ కోలుకుంటున్న సమయంలో ఆమె క్రమశిక్షణతో కూడిన జీవనశైలి వివరాలను గురించి వారు పంచుకున్నారు. ఆమె ప్రతి రోజూ  నిమ్మరసం, పచ్చి పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేప ఆకులు, తులసి వంటి వాటితోపాటు గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్‌రూట్ వాల్‌నట్‌లతో తయారు చేసిన పండ్ల రసాలు తీసుకునేవారని సిద్దు తెలిపారు. 

 

ఇది కూడా చదవండి..ఆటిజం థెరపీ ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారా..?

ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

 

 యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక ఆహారాలను కూడా ఆమె తీసుకున్నారని అందులో కొన్ని మార్పులు చేసినాట్లు తెలిపారు. వంటలో కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లేదా బాదం నూనె మాత్రమే వాడారు. ఉదయం టీలో దాల్చినచెక్క, లవంగాలు, బెల్లం,ఏలకులు వంటి సుగంధ ద్రవ్యాలు వేసి ప్రతిరోజూ తీసుకునేవారని ఆయన వివరించారు. క్రమశిక్షణ, ధైర్యం, ఆరోగ్యకరమైన జీవనశైలితో క్యాన్సర్‌ను ఓడించవచ్చు," అని, నవజ్యోత్ కౌర్ సిద్ధూ ఈ మహమ్మారి నుంచి బయటపడిన విధానం ఇతరులకు స్ఫూర్తినిస్తుందని ఆయన చెప్పారు.

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : women-health mental-health treatment cancer cancer-survivor fight-against-cancer liver-cancer nutritional-support #navjotkaursidhu stage-4-cancer cancer-recovery discipline-and-health government-hospitals mental-strength family-support positive-mindset over-coming-cancer cancer-warrior
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com