సిఓపిడి కేసులు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే..
సాక్షి లైఫ్ : ప్రస్తుతం శ్వాసకోశ సంబంధిత సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. వాయుకాలుష్యం కారణంగా ప్రజల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఓపిడి) అనేది ఊపిరితిత్తులు, శ్వాసకోశాన్ని ప్రభావితం చేసే వ్యాధి. ఈ వ్యాధి కాలక్రమేణా పెరుగుతుంది.
వాయు కాలుష్యం కారణంగా మరింత తీవ్రమవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితిలో కలుషిత వాతావరణంలో నివసిస్తున్నప్పుడు ఈ వ్యాధి నుంచి రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అందులో భాగంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. సరైన ఔషధాలు వాడడం కూడా చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి..క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(సిఓపిడి)అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ బెనిఫిట్స్..
ఇది కూడా చదవండి..ఏమేం కూరగాయలు తింటే శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయి..?
వాయు కాలుష్యం క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(సిఓపిడి) వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ వ్యాధి క్రమంగా ఊపిరితి త్తులను చుట్టుముడుతుంది. చలికాలంలో శ్వాసనాళం సన్నగా మారుతుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ వ్యాధిని ముందుగా గుర్తించి తగిన చికిత్స చేయవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ వ్యాధి విషయంలో కఫంతో కూడిన దగ్గు ఉంటుంది. కొన్ని మార్పులు చేయడం ద్వారా దీనిని నివారించవచ్చు.
ఇది కూడా చదవండి..కిడ్స్ హెల్త్ : పిల్లలలో ఆటిజం ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే..
ఇది కూడా చదవండి..బీఎంటీ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆకు కూరలు మధుమేహాన్ని నియంత్రిస్తాయా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
