పోలియోమైలిటిస్ అంటే..?
సాక్షి లైఫ్ : పోలియాను పోలియోమైలిటిస్ అని కూడా అంటారు. అంతేకాదు దీనికే మరొకపేరుకూడా ఉంది. అదే శిశు పక్షవాతం. ఇది వెన్నుపాము నరాలను ప్రభావితం చేసే పోలియో వైరస్ కారణంగా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది కొందరిలో పక్షవాతానికి కారణం అవుతుంది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. పోలియో వైరస్ మొదట గొంతుకు ఆ తరువాత ప్రేగులకు సోకుతుంది. దీని కారణంగా మొదటి ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అనంతరం ఈ ఇన్ఫెక్షన్ మెదడు, వెన్నుపాముపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?
ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?
ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..?
ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..?
పోలియో ఎలా వ్యాపిస్తుంది..?
టాయిలెట్‌కి వెళ్లిన తర్వాత చేతులు సరిగా కడుక్కోకపోవడం,మురికి నీరు తాగడం లేదా ఆ నీళ్లతోనే వంట చేయడం ద్వారా పోలియో వైరస్ వచ్చే అవకాశం ఉంది. మురికి నీటిలో ఈత కొట్టడం, పరిశుభ్రంగా లేని ఆహారం తినడం వల్ల కుడా ఇది వస్తుంది.
పోలియో లక్షణాలు ఏమిటి?
గొంతు నొప్పి
జ్వరం
తలనొప్పి
కడుపు నొప్పి
వాంతి
అతిసారం
ఆయాసం
మెడ,కండరాల నొప్పి
కాళ్లు లేదా చేతులు కదలడంలో ఇబ్బంది
పక్షవాతం..
ఇది కూడా చదవండి..ఏ వైపు నిద్రించడం ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి..ఈ ఎనిమిది టిప్స్ పాటిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచుకోవచ్చు..
ఇది కూడా చదవండి..మెనోపాజ్ కారణంగా మహిళల్లో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు..
ఇది కూడా చదవండి..ఆస్టియోపోరోసిస్ ను ఎలా నివారించవచ్చు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
