The Best Diet for Arthritis : ఆర్థరైటిస్‌కు మందులా పనిచేసే అద్భుతమైన డైట్.. కీళ్ల నొప్పులకు సరైన పరిష్కారం..!
సాక్షి లైఫ్ : ఉదయం నిద్రలేవగానే కీళ్లు పట్టేసినట్లు అనిపిస్తోందా..? మెట్లు ఎక్కుతుంటే మోకాళ్లలో నొప్పులు, కటకట శబ్దాలు వస్తున్నాయా..? అయితే వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఇవి ఎముకల సమస్యలకు, ముఖ్యంగా శరీరంలో దీర్ఘకాలంగా ఉండే వాపు (Chronic Inflammation)కు సంకేతాలు కావచ్చు. సాధారణంగా ఆర్థరైటిస్ (arthritis) రోగులలో కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడానికి కేవలం మందులపైనే ఆధారపడటం ఎల్లప్పుడూ సరైనది కాదు. మందులతో పాటు జీవనశైలి, ఆహారపు అలవాట్లలో తగిన మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 'యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్' (Anti-inflammatory diet) గురించిన చర్చ జోరుగా సాగుతోంది. ఈ డైట్ వాపులను తగ్గించి, నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా కీళ్ల పనితీరును మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్ అంటే ఏమిటి..?
శరీరంలో వాపులను (Inflammation) తగ్గించడంలో సహాయపడే పోషక విలువలున్న ఆహారాన్నే 'యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్' అంటారు.
ఏం తినాలి..?
ప్రధానంగా తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, నట్స్ అంటే బాదం, వాల్ నట్స్ వంటివి, సీడ్స్ అంటే ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.
ఈ ఆహార పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర కణాలను ఆక్సీకరణ ఒత్తిడి (Oxidative stress) నుంచి కాపాడతాయి.
ఏం తినకూడదు అంటే..?
ఈ డైట్‌లో భాగంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, శీతల పానీయాలు, జంక్ ఫుడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.
అసలు ఇన్‌ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది..?
వాపు అనేది మన శరీర సహజ రక్షణ వ్యవస్థలో ఒక భాగం. ఏదైనా గాయం అయినప్పుడు, ఇన్ఫెక్షన్ సోకినప్పుడు లేదా ఏదైనా హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, మన రోగనిరోధక వ్యవస్థ వాటితో పోరాడే క్రమంలో వాపును కలగజేస్తుంది. అయితే, ఈ ప్రక్రియ శరీరంలో దీర్ఘకాలం పాటు కొనసాగితే దానిని 'క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్' అంటారు.
ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీసే కారణాలు..?
ఊబకాయం..
ధూమపానం, మద్యపానం
విపరీతమైన మానసిక ఒత్తిడి
తగినంత నిద్ర లేకపోవడం
పోషకాలు లేని జంక్ ఫుడ్ తినడం
శారీరక శ్రమ లేకపోవడం
ఇలా దీర్ఘకాలం పాటు శరీరంలో వాపులు కొనసాగితే అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆర్థరైటిస్ రోగులలో కీళ్ల నొప్పులు, వాపులు మరింత పెరగడానికి కూడా ఇదే కారణం. కాబట్టి, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్‌ను పాటించడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Rare IgG4-Related Disease Mimics Cancer : క్యాన్సర్‌ను పోలి ఉండే అరుదైన వ్యాధి 'IgG4' .. భారత్ లో విజృంభిస్తున్న న్యూ డిసీజ్..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
