సాక్షి లైఫ్ : మనలో చాలా మంది కాలేయ వ్యాధి మద్యం తాగేవారికి మాత్రమే వస్తుందని నమ్ముతారు కానీ.. ఇది నిజం కాదు.. తాగుడు అలవాటు లేకపోయినా లివర్ చెడిపోతుందా..? అదెలా అంటే అవుననే అంటున్నారు వైద్యనిపుణులు. కొన్నిరకాల రోజువారీ అలవాట్లు నెమ్మదిగా కాలేయాన్ని అనారోగ్యానికి గురి చేస్తాయని వారు చెబుతున్నారు. అవేంటంటే..?
ఇది కూడా చదవండి..వంట నూనెలలో ఉండే కొవ్వు కారణంగా రొమ్ము క్యాన్సర్..
ఇది కూడా చదవండి..వరల్డ్ లివర్ హెల్త్ డే-2025: కాలేయ పనితీరు తెలుసుకునే ముఖ్యమైన వైద్య పరీక్షలు..
ఇది కూడా చదవండి..మీకు అధిక కొలెస్ట్రాల్ ఉందా..? ఈ 5 కూరగాయలు తినండి..
ఇది కూడా చదవండి..ఫుడ్ అనేది పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..?
ఈ 5 కారణాల వల్ల కాలేయం చెడిపోతుంది..
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఎన్ఏఎఫ్ఎల్ డి నేటి కాలంలో చాలా పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ఈ రోజుల్లో మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కాలేయ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వ్యాధి మద్యం తాగని, ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ లేదా సరైన ఆహారపు అలవాట్లతో బాధపడేవారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్, వేయించిన ఆహారాలు, చక్కెర పానీయాలు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది.
సకాలంలో గుర్తించడం వల్ల..
"నిరంతర బరువు పెరగడం, అలసట, కడుపులో బరువుగా అనిపించడం లేదా తేలికపాటి నొప్పి, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కాలేయ రుగ్మతకు సంకేతం కావచ్చు. సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే, ఈ చిన్న సమస్యలు తరువాత కాలేయ సిర్రోసిస్ లేదా కాలేయ క్యాన్సర్‌కు దారితీయవచ్చు" అని వైద్యనిపుణులు చెబుతున్నారు.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే..?
అప్పుడప్పుడు కాలేయాన్ని తనిఖీ చేసుకోండి, సమతుల్య ఆహారం తీసుకోండి, వ్యాయామం చేయండి, మీ బరువును అదుపులో ఉంచుకోండి.