ఈ సమస్యలున్న వాళ్లు వేరుశెనక్కాయలు తినకూడదా..?
సాక్షి లైఫ్ : వేరుశెనగకాయలు అంటే ప్రతిఒక్కరూ ఇష్టపడుతుంటారు. అయితే పలురకాల అనారోగ్య సమస్యలున్నవాళ్లు తినడంవల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా సాధారణ రోజులతో పోలిస్తే శీతాకాలంలో ప్రజలు వేరుశెనగను ఎక్కువగా తింటారు. వేరుశెనక్కాయలలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే ఎలాంటివాళ్లు వేరుశెనగకాయలు అస్సలు తినకూడదో తెలుసా?
కొన్నిరకాల ఆహారాలు కొందరి ఆరోగ్యానికి మంచిదైతే అవే ఆహారాలు మరికొందరి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. చలికాలంలో వేరుశెనగను ఎక్కువగా తింటారు కానీ సినిమా చూసినప్పుడో, స్నేహితులతో ఎక్కువసేపు మాట్లాడినప్పుడో టైం పాస్‌గా కూడా తింటారు.
వేరుశెనగ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వేరుశెనగలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. కానీ అవి ఎక్కువగా తింటే శరీరానికి హానికరమని చెబుతున్నారు వైద్యులు.
ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వాళ్లు..
ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వాళ్లు వేరుశెనగ తినకూడదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆర్థరైటిస్ రోగులకు తరచుగా కీళ్లలో నొప్పి ఉంటుంది కాబట్టి, వారు వేరుశెనగ తింటే, సమస్య తీవ్రమవుతుందని వారు అంటున్నారు.
ఊబకాయంతో బాధపడేవారు వేరుశెనగకాయలు తినకూడదు. వేరుశెనగలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారు వేరుశెనగ తినకుండా ఉండాలి.
కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు వేరుశెనగ తినకూడదు. ఎందుకంటే వేరుశెనగ ఆయా సమస్యలను మరింత పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.
అలర్జీ సమస్యలు..
కొంతమందికి వేరుశెనగ తిన్నాక అలర్జీ సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో వేరుశెనగను మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలనుకున్నప్పుడు, ఖచ్చితంగా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.
బీపీ కూడా అధికమవుతుంది..
వేరుశెనగలో పోషకాలు ఉంటాయి. ఇందులో సోడియం కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే శరీరంలో సోడియం పెరిగి బీపీ కూడా అధికమవుతుంది.
వేరుశెనక్కాయలలో పోషకాలు..
వేరుశెనక్కాయలలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో కనిపిస్తాయి. రెస్వెట్రల్ , ఫైటోస్టెరాల్ వంటి పోషకాలు కూడా ఇందులో ఉంటాయి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
