Fasting time : ఉపవాస సమయంలో శరీరంలోని శక్తి తగ్గకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
సాక్షి లైఫ్ : ఉత్తరాది సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, కఠినమైన పండుగల్లో ‘ఛఠ్ మహాపర్వం’ ఒకటి. సూర్యభగవానుడిని, ఛఠీ మాతను ఆరాధిస్తూ భక్తులు ఆచరించే ఈ వ్రతంలో దాదాపు 36 గంటల పాటు నీరు కూడా ముట్టకుండా ‘నిర్జల ఉపవాసం’ ఉంటారు. సుదీర్ఘ సమయం పాటు ఆహార పానీయాలు లేకుండా ఉండటం శారీరకంగా పెద్ద సవాలే. అంతేకాదు మన తెలుగు రాష్ట్రాల్లో సైతం కార్తీక మాసం మొదలైంది. ఈ మాసంలో కార్తీక ఉపవాసాలు చేస్తుంటారు. అందుకే ఉపవాసం ప్రారంభించడానికి ముందే శరీరానికి తగినంత పోషణ, శక్తిని అందించడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఉపవాస సమయంలో నీరసం రాకుండా ఉండటానికి ముందుగా ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో చూద్దాం..
ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఆహారంలో చేర్చుకోవాల్సిన ముఖ్యమైన పోషకాలు..
అరటి, యాపిల్, దానిమ్మ, బొప్పాయి, నారింజ వంటి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా అరటిపండు శరీరానికి తక్షణ, స్థిరమైన శక్తిని అందించడంలో తోడ్పడుతుంది.
బాదం, వాల్నట్స్, కిస్మిస్, ఖర్జూరం వంటి ఎండు ఫలాల్లో శరీరానికి మేలు చేసే కొవ్వులు, సూక్ష్మపోషకాలు ఉంటాయి. వీటిని పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల రోజంతా శక్తి స్థిరంగా ఉంటుంది. ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం..పెసరపప్పు, కందిపప్పు లేదా ఇతర పప్పుధాన్యాలను భోజనంలో భాగం చేసుకోవాలి. ప్రొటీన్ కండరాల దృఢత్వానికి, అలసట రాకుండా ఉండటానికి సహాయపడుతుంది.
ఆకుకూరలు, కూరగాయలు..పాలకూర, తోటకూర, సొరకాయ, బీరకాయ వంటి తేలికగా జీర్ణమయ్యే కూరగాయలను తక్కువ నూనె, మసాలాలతో వండుకుని తినడం మంచిది. ఇది జీర్ణవ్యవస్థపై భారం పడకుండా చూస్తుంది. పాల ఉత్పత్తులు.. పాలు, పెరుగు లేదా మజ్జిగ ద్వారా కాల్షియం, ప్రొటీన్ లభిస్తాయి. ఇవి శరీరానికి చలవ చేయడంతో పాటు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.
ద్రవ పదార్థాల వినియోగం..నిర్జల దీక్ష మొదలయ్యే ముందు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఒకేసారి కాకుండా రోజంతా విడతల వారీగా మంచినీరు, కొబ్బరినీళ్లు, పల్చటి మజ్జిగ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. సరైన ఆహార ప్రణాళికను పాటించడం ద్వారా ఎటువంటి శారీరక అలసట లేకుండా భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
