Mouth Ulcer : నోటి పూత తగ్గట్లేదా..? నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ ముప్పు.. నిపుణుల హెచ్చరిక..!
సాక్షి లైఫ్ : నోటిలో పుండ్లు లేదా పూత (Ulcers) రావడం సర్వసాధారణం. పొరపాటున బుగ్గ లేదా నాలుక కొరుక్కున్నప్పుడు, గట్టి బ్రష్‌తో పళ్లు తోముకున్నప్పుడు, శరీరంలో విటమిన్ బి-12 లేదా ఫోలేట్ లోపం వల్ల ఇవి వస్తుంటాయి. సాధారణంగా ఒకటి లేదా రెండు వారాల్లో ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే మూడు వారాలకు మించినా నోటి పూత తగ్గకపోతే మాత్రం ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని, అది నోటి క్యాన్సర్ (Oral Cancer) తొలి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
గత రెండు దశాబ్దాలుగా 50 ఏళ్ల లోపు యువతలోనూ నోటి క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. నొప్పి లేనంత మాత్రాన పూతను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ముదిరిపోయే ప్రమాదం ఉందని దంత వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం అవ్వండి..
నాలుక, చిగుళ్లు, దవడల లోపలి భాగంలో వచ్చే పుండు మూడు వారాలు దాటినా మానకపోవడం.నోటి లోపలి భాగంలో అసాధారణంగా ఎరుపు లేదా తెలుపు రంగు మచ్చలు (Patches) ఏర్పడటం.దవడలు, పెదవులు లేదా మెడ భాగంలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా గడ్డలు, వాపు రావడం. ఆహారం లేదా నీరు మింగేటప్పుడు గొంతులో నొప్పిగా లేదా అడ్డంకిగా అనిపించడం.
ప్రధాన కారణాలు..పెరుగుతున్న ముప్పు..
ధూమపానం, మద్యం రెండూ కలిపి తీసుకునే వ్యక్తులలో నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు సాధారణ వ్యక్తుల కంటే దాదాపు 30 రెట్లు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. మద్యం మాత్రమే అధికంగా సేవించేవారిలో కూడా ఈ ప్రమాదం నాలుగు రెట్లు అధికం. శారీరక సంబంధాల ద్వారా సోకే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ కూడా నోటి క్యాన్సర్‌కు ఒక ప్రధాన కారణంగా మారుతోంది.
క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత సులువవుతుంది. రోజూ బ్రష్ చేసుకున్న తర్వాత అద్దం ముందు నిలబడి నాలుక కింద, చిగుళ్లు, గొంతు లోపలి భాగాన్ని పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏమాత్రం అసాధారణ మార్పులు కనిపించినా వెంటనే దంత వైద్యుడిని లేదా క్యాన్సర్ నిపుణుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
