గట్ హెల్త్ కు మేలు చేసే గింజలు.. 

సాక్షి లైఫ్ : వాస్తవానికి, అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం  చియాసీడ్స్‌ ఉపయోగపడతాయి. ఇవి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అసలు వదిలి పెట్టరు. 

చియా సీడ్స్‌లో.. 

చియా సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు, రకరకాల అసంతృప్త కొవ్వులు, పీచుపదార్థం, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మైరిసెటిన్, క్వెర్సెటిన్ సమ్మేళనం, కెఫిక్ యాసిడ్ ,రోస్మరినిక్ యాసిడ్ ఉంటాయి. 

83 శాతం ఫైబర్..

చియా గింజల్లో ఔన్సు (28 గ్రాములు) 138 కేలరీలు ఉంటాయి. వాటిలో 6శాతం నీరు, 46శాతం కార్బోహైడ్రేట్లు ,వీటిలో 83శాతం ఫైబర్, 34శాతం  కొవ్వు , 19 శాతం ప్రోటీన్లు ఉంటాయి.

 - చియా విత్తనాలు పేగు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ పేగు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ గింజలు జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. ఈ గింజల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల మధుమేహం, కొవ్వుల అసమతౌల్యత ,అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇవి చర్మానికి చాలా మంచివి. కీళ్ల నొప్పులు, నడవడంలో ఇబ్బంది ఉన్నవారికి ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి. చియా విత్తనాలను కూరగాయలతో కలిపి తినవచ్చు. అంతేకాదు వాటిని కాల్చుకుని కూడా తినవచ్చు. మీరు బరువు తగ్గాలనుకుంటే సలాడ్ రూపంలో వీటిని తినవచ్చు. ఇవి ఆకలిని కూడా తీరుస్తాయి.
 
 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : chia-seeds
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com