థైరాయిడ్ టెస్ట్ : ఎంత ఉంటే నార్మల్..?
సాక్షి లైఫ్ : శరీరంలో అధికంగా హార్మోన్లు ఎక్కువగా ఉంటే " హైపర్ థైరాయిడిజం" అని , తక్కువగా ఉంటే హైపోథైరాయిడిజం అని అంటారు. హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయితే కొన్నిరకాల సమస్యలు తలెత్తుతాయి. తగ్గితే కూడా ఇంకొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు లేని కారణంగా చాలా మందిలో థైరాయిడ్ సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఐతే వయసును బట్టి థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్(టీ.ఎస్.హెచ్) పరీక్ష ద్వారా థైరాయిడ్ స్థాయిల ను గుర్తించవచ్చు.
వయస్సు నార్మల్ తక్కువ ఎక్కువ
| 18–30 సంవత్సరాలు | 0.5–4.1 mU/L | <0.5 mU/L | > 4.1 mU/L |
| 31–50 సంవత్సరాలు | 0.5–4.1 mU/L | <0.5 mU/L | > 4.1 mU/L |
| 51–70 సంవత్సరాలు | 0.5–4.5 mU/L | <0.5 mU/L | > 4.5 mU/L |
| 71–90 సంవత్సరాలు | 0.4–5.2 mU/L | <0.4 mU/L | > 5.2 mU/L |
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
