Vitamin C : విటమిన్ సి లోపాన్ని అధిగమించి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే 10 సూపర్ ఫుడ్స్ ఇవే..
సాక్షి లైఫ్ : శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షించడంలో విటమిన్ సి (Vitamin C) అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే నీరసం, చిగుళ్ల నుండి రక్తస్రావం, గాయాలు త్వరగా మానకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరం స్వయంగా ఈ విటమిన్‌ను తయారు చేసుకోలేదు కాబట్టి, మన దైనందిన ఆహారంలో దీనిని చేర్చుకోవడం తప్పనిసరి. విటమిన్ సి లోపాన్ని అధిగమించి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే 10 సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
1. ఉసిరి (Amla)..
విటమిన్ సి కి అత్యంత శక్తివంతమైన, సహజమైన వనరు ఉసిరి. ప్రయోజనాలు ఏమిటి..? ఇది రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంచడమే కాకుండా, జుట్టు రాలడాన్ని తగ్గించి, చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. నిత్యం ఉసిరి రసం లేదా పొడి రూపంలో దీనిని తీసుకోవచ్చు.
2. జామకాయ (Guava)..
సాధారణంగా నారింజ పండ్లలోనే విటమిన్ సి ఎక్కువ అనుకుంటారు, కానీ వాటి కంటే జామకాయలోనే ఈ విటమిన్ రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ప్రయోజనాలు ఏమిటి..? ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యానికి జామకాయ ఎంతో మేలు చేస్తుంది.
3. నారింజ, నిమ్మ (Citrus fruits)..
నారింజ, బత్తాయి, నిమ్మకాయలలో విటమిన్-సి సమృద్ధిగా లభిస్తుంది.
ప్రయోజనాలు ఏమిటి..?ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు (Toxins) బయటకు వెళ్లిపోతాయి. నారింజ పండ్లు జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి.
విటమిన్ సి కేవలం రోగనిరోధక శక్తికే కాదు, చర్మాన్ని యవ్వనంగా ఉంచే 'కొల్లాజెన్' (Collagen) ఉత్పత్తికి,ఆహారం నుంచి ఐరన్ గ్రహించడానికి శరీరానికి చాలా అవసరం.
4. కివి పండు (Kiwi)..
విదేశీ పండైనప్పటికీ ప్రస్తుతం మనకు సులభంగా దొరుకుతున్న కివిలో విటమిన్-సి తో పాటు విటమిన్-కె, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర అలసటను తగ్గించి, ప్లేట్‌లెట్ల సంఖ్యను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
5. రంగు రంగుల క్యాప్సికమ్..
ఎరుపు, పసుపు, ఆకుపచ్చ క్యాప్సికమ్‌లలో (Bell Peppers) విటమిన్-సి అధిక మోతాదులో ఉంటుంది. వీటిని సలాడ్లు లేదా కూరల రూపంలో తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగవడంతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
6. బొప్పాయి, స్ట్రాబెర్రీస్..
బొప్పాయి.. జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్ సి ని అందిస్తుంది.
స్ట్రాబెర్రీస్ ..ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
7. బ్రోకలీ, టమాటాలు..
బ్రోకలీ.. క్యాబేజీ జాతికి చెందిన ఈ కూరగాయలో విటమిన్ సి ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇది బరువు నియంత్రణకు తోడ్పడుతుంది.
టమాటా.. రోజువారీ వంటల్లో వాడే టమాటాలలో విటమిన్ సి తో పాటు గుండెకు మేలు చేసే 'లైకోపీన్' అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. విటమిన్ సి వేడికి త్వరగా నశిస్తుంది. కాబట్టి పండ్లు, కూరగాయలను వీలైనంత వరకు ఎక్కువగా ఉడికించకుండా, తాజాగా ఉన్నప్పుడే లేదా సలాడ్ల రూపంలో తీసుకోవడం ద్వారా పూర్తి పోషకాలను పొందవచ్చు.
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
