Type 3c Diabetes : టైప్-1, టైప్-2 తెలుసు.. మరి 'టైప్-3సి' డయాబెటిస్ అంటే ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య మధుమేహం. సాధారణంగా డయాబెటిస్(diabetes) అనగానే టైప్-1, టైప్-2 మాత్రమే ఎక్కువగా ప్రచారంలో కనిపిస్తాయి. అయితే, వీటితో పాటు క్లోమగ్రంథి (pancreas) దెబ్బతినడం వల్ల తలెత్తే మరో తీవ్రమైన సమస్య 'టైప్-3సి డయాబెటిస్' (Type 3c Diabetes). దీనిని వైద్య పరిభాషలో ‘pancreatogenic diabetes’ అని కూడా పిలుస్తారు. చాలా సందర్భాల్లో దీని లక్షణాలు టైప్-2ను పోలి ఉండటంతో సరైన నిర్ధారణ ఆలస్యమవుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

ఇతర రకాలతో పోలిస్తే ఇది ఎలా భిన్నం అంటే..?

శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో క్లోమం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. టైప్-1 డయాబెటిస్.. శరీర రోగనిరోధక వ్యవస్థే పొరపాటున ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేసి నాశనం చేస్తుంది. టైప్-2 డయాబెటిస్..శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను కణాలు సరిగ్గా వినియోగించుకోలేకపోవడం అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది.

టైప్-3సి డయాబెటిస్..ఏదైనా శారీరక వ్యాధి, ఇన్ఫెక్షన్ లేదా శస్త్రచికిత్స వల్ల క్లోమం దెబ్బతిన్నప్పుడు ఇది సంభవిస్తుంది. ఇందులో ఇన్సులిన్ లోపంతో పాటు జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైముల ఉత్పత్తి కూడా పడిపోతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు పెరగడంతో పాటు తీవ్రమైన జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

ప్రధాన కారణాలు..?

క్లోమ గ్రంథి దెబ్బతినడానికి దారితీసే పరిస్థితులే టైప్-3సి డయాబెటిస్‌కు మూలకారణాలు..పాంక్రియాటైటిస్..క్లోమగ్రంథిలో దీర్ఘకాలికంగా వాపు (chronic pancreatitis) ఉండటం వల్ల అక్కడి కణాలు క్రమంగా దెబ్బతింటాయి. క్లోమ క్యాన్సర్.. ట్యూమర్లు లేదా క్యాన్సర్ కణితుల ప్రభావంతో గ్రంథి పనితీరు క్షీణిస్తుంది. శస్త్రచికిత్సలు..ఏదైనా అనారోగ్యం కారణంగా క్లోమంలో కొంత భాగాన్ని లేదా పూర్తి గ్రంథిని తొలగించాల్సి వచ్చినప్పుడు ఈ ముప్పు ఏర్పడుతుంది.

టైప్-3సి డయాబెటిస్ అంటే ఏమిటి..?

క్లోమ గ్రంథి (pancreas) వ్యాధులకు గురైనప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు వచ్చే మధుమేహాన్నే 'టైప్-3సి' లేదా 'పాంక్రియోటోజెనిక్ డయాబెటిస్' అంటారు. శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్, గ్లూకగాన్ హార్మోన్లతో పాటు జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో క్లోమం కీలక పాత్ర పోషిస్తుంది. క్లోమం దెబ్బతిన్నప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాకుండా, జీర్ణవ్యవస్థ పనితీరు కూడా తీవ్రంగా దెబ్బతింటుంది.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.