Heart Attack : బీపీ నార్మల్‌గా ఉన్నా గుండెపోటు ముప్పు ఉంటుందా..? డాక్టర్లు ఏమంటున్నారు..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చాలామంది తమ రక్తపోటు (bp) నార్మల్‌గా ఉంటే, తమ గుండె కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లే అని భావిస్తుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బీపీ సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ కొందరిలో గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. శరీరంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్, మధుమేహం, ధూమపానం, చెడు జీవనశైలి వంటి అనేక అంశాలు దీనికి కారణమవుతాయి. కాబట్టి, కేవలం బీపీ రీడింగ్ చూసుకుని గుండె సేఫ్‌గా ఉందని నిర్ధారణకు రావడం సరైనది కాదు.

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

బీపీ నార్మల్‌గా ఉన్నా గుండెపోటు ఎందుకొస్తుంది..?

గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్, ఇతర కొవ్వు పదార్థాలు పెరిగినప్పుడు అవి రక్తనాళాల లోపలి గోడలపై పూడికల్లా పేరుకుపోతాయి. ఏదైనా కారణం చేత ఈ ప్లాక్ పగిలినప్పుడు, అక్కడ రక్తం గడ్డకట్టి గుండెకు రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది. ఇలాంటి స్థితిలో వ్యక్తి బీపీ నార్మల్‌గా ఉన్నప్పటికీ హార్ట్ ఎటాక్ వస్తుంది.

గుండెపోటు ముప్పును పెంచే ఇతర కారణాలు..

రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడానికి ఇదే ప్రధాన కారణం. మధుమేహం (Diabetes)..షుగర్ లెవెల్స్ అదుపులో లేకపోవడం గుండె రక్తనాళాలను దెబ్బతీస్తుంది. స్మోకింగ్ వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. శారీరక శ్రమ లేకపోవడం కూర్చుని చేసే ఉద్యోగాలు, జంక్ ఫుడ్ తినడం, సరైన నిద్ర లేకపోవడం.  అధిక బరువు, అలాగే కుటుంబంలో గతంలో ఎవరికైనా చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చి ఉంటే ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది.

గుండెపోటు లక్షణాలను ఎలా పసిగట్టాలి..?

ఛాతీలో ఏదో బరువు పెట్టినట్లు పట్టేయడం, తీవ్రమైన ఒత్తిడి లేదా నొప్పి. ఆ నొప్పి క్రమంగా ఎడమ చేయి, వీపు, మెడ లేదా దవడ భాగాలకు వ్యాపించడం. చిన్న పనికే ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడటం.

అకస్మాత్తుగా చల్లటి చెమటలు పట్టడం, వికారం, తల తిరగడం.ముఖ్య గమనిక.. మహిళల్లో, దీర్ఘకాలిక మధుమేహం ఉన్నవారిలో ఈ లక్షణాలు చాలా స్వల్పంగా ఉండొచ్చు లేదా ఛాతీ నొప్పి లేకుండా కేవలం నీరసం, ఆయాసం మాత్రమే కనిపించొచ్చు.

గుండె పదిలంగా ఉండాలంటే ఏం చేయాలి..?

కేవలం బీపీ మాత్రమే కాదు.. తరచుగా రక్తంలో చక్కెర (blood sugar), కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా వైద్యుల సలహా మేరకు పరీక్షించుకోవాలి. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. నూనె పదార్థాలు, ఉప్పు వాడకం తగ్గించాలి. రోజులో కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా లేదా ఏదైనా శారీరక వ్యాయామం చేయాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకుని ప్రతిరోజూ 7-8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. ఛాతీలో ఎలాంటి అసౌకర్యం లేదా నొప్పి అనిపించినా నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే గుండె సంబంధిత వైద్యులను సంప్రదించి ఈసీజీ లాంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.