Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఫుడ్స్ లేకుండా చూసుకోండి...!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం తీసుకునే అల్పాహారం (Breakfast) రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. అయితే, మనం తినే ప్రతి ఆహారం కాలేయానికి (Liver) మేలు చేస్తుందనుకుంటే పొరపాటే. ముఖ్యంగా 'ఫ్యాటీ లివర్' సమస్యతో బాధపడేవారు చక్కెరలు, రిఫైండ్ కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం ఆరోగ్యకరం అని భ్రమపడే కొన్ని బ్రేక్‌ఫాస్ట్‌ ఆప్షన్స్ లివర్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయి. అవేంటో, వాటికి సరైన ప్రత్యామ్నాయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

1. ఒట్టి అటుకులు తినడం..

అటుకులు తేలికగా జీర్ణమవుతాయి కానీ, కేవలం అటుకులు మాత్రమే తింటే శరీరంలో కార్బోహైడ్రేట్ల శాతం అమాంతం పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఇది అంత మంచిది కాదు. అటుకులను మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి అందులో క్యారెట్, బీన్స్ వంటి కూరగాయల ముక్కలు, పల్లీలు, లేదా కాస్త పెరుగు కలుపుకుని తింటే ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి.

2. ప్లెయిన్ రవ్వ ఉప్మా..

మన ఇళ్లలో సాధారణంగా చేసుకునే ఉప్మాను బొంబాయి రవ్వతో చేస్తారు. ఇందులో రిఫైండ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్యాటీ లివర్ పేషెంట్లకు ఇది అనర్థదాయకం. ఉప్మాలో ఎక్కువ మోతాదులో కాయగూరలు, బఠానీలు, పప్పు దినుసులు వేసి చేసుకోవడం ఉత్తమమైన ప్రత్యామ్నాయం.

3. బ్రెడ్, బటర్, జామ్..

వైట్ బ్రెడ్‌కు వెన్న, తీయటి జామ్ రాసుకుని తినడం రుచిగా అనిపించినా.. ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే చెడు కొవ్వులు, అదనపు చక్కెరలు విపరీతంగా ఉంటాయి. ఇది కాలేయానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. వైట్ బ్రెడ్‌కు బదులుగా 100% చిరుధాన్యాల బ్రెడ్‌ను ఎంచుకోండి. తీపి జామ్ ప్లేస్‌లో షుగర్-ఫ్రీ పీనట్ బటర్‌ను వాడటం మంచిది.

4. టీ, బిస్కెట్లు..

ఉదయం ఒక కప్పు టీలో రెండు బిస్కెట్లు ముంచుకుని తినడం చాలామందికి అలవాటు. అయితే, టీలో ఉండే చక్కెర, బిస్కెట్లలో వాడే మైదా ఆరోగ్యానికి హానికరం. వీటిలో ప్రోటీన్, ఫైబర్ దాదాపుగా శూన్యం. తీపి పానీయాలు, రిఫైండ్ ఆహారాలు ఫ్యాటీ లివర్‌కు ప్రమాదకరం.

5. కార్న్ ఫ్లేక్స్ వంటివి..

ఇవి రెడీ-టు-ఈట్ కాబట్టి హెల్తీ అని చాలామంది భావిస్తారు. కానీ, మార్కెట్లో దొరికే చాలా సిరియల్స్‌లో రుచి కోసం చక్కెరను భారీగా కలుపుతారు. ఫ్యాటీ లివర్ ఉన్నవారు వీటిని రోజూ అల్పాహారంగా తీసుకోవడం మంచిది కాదు. వీటికి బదులుగా చక్కెర లేని ఓట్స్, దాలియా లేదా తృణధాన్యాలను ఎంచుకోండి. వాటిలో తాజా పండ్లు, బాదం, వాల్‌నట్స్ కలుపుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం.

ఫ్యాటీ లివర్ పేషెంట్ల అల్పాహారం ఎలా ఉండాలి..?

అల్పాహారం మానేయడం సమస్యకు పరిష్కారం కాదు. మీ ప్లేట్‌లో 'ఫైబర్ + ప్రోటీన్ + హెల్తీ కార్బోహైడ్రేట్లు' సమతుల్యంగా ఉండేలా చూసుకోండి. మొలకలు, తాజా కూరగాయలు, పప్పులు, గుడ్లు, ఓట్స్ వంటివి ఉదయం పూట తినడం అలవాటు చేసుకుంటే కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.