Bodybuilding Tips : బాడీ బిల్డర్లలా కనిపించాలంటే ఈ సహజసిద్ధమైన మార్గాలే మేలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుత యువతలో వ్యాయామశాలలకు (gym) వెళ్లి కండలు తిరిగిన శరీరాన్ని సొంతం చేసుకోవాలనే ఆసక్తి విపరీతంగా పెరిగింది. అయితే, వేగంగా ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో చాలామంది నేరుగా మార్కెట్లో లభించే ప్రోటీన్ పౌడర్లను, సప్లిమెంట్లను ఆశ్రయిస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణ లేకుండా తీసుకునే నాసిరకం సప్లిమెంట్లు ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి బదులు, శరీరాన్ని లోపలి నుంచి గుల్లబార్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

అసలు ప్రోటీన్ ఎంత అవసరం..?

సాధారణంగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తికి రోజువారీగా శరీర బరువులోని ప్రతి కిలోగ్రాముకు సుమారు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుంది. అంటే 60 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు దాదాపు 48 గ్రాముల ప్రోటీన్ సరిపోతుంది. కఠినమైన కసరత్తులు చేసేవారికి, కండరాల నిర్మాణంపై దృష్టి పెట్టేవారికి ఈ అవసరం కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ, అవసరానికి మించి అదనపు రసాయనాలతో కూడిన పొడులపై ఆధారపడటం దీర్ఘకాలంలో మూత్రపిండాలు, కాలేయంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. సహజమైన ఆహార పదార్థాల ద్వారానే శరీరానికి అవసరమైన పోషకాలను సులభంగా భర్తీ చేసుకోవచ్చు.

మాంసాహార ప్రియుల కోసం..

ఒక్కో గుడ్డు ద్వారా శరీరానికి సుమారు 6 నుంచి 7 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్ అందుతుంది. 100 గ్రాముల చికెన్ తీసుకోవడం ద్వారా దాదాపు 25 నుంచి 30 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది.  100 గ్రాముల చేపల ద్వారా దాదాపు 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్‌తో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కూడా సమకూరుతాయి.

శాకాహారులకు పుష్కలమైన ఎంపికలు..

పనీర్, పాల ఉత్పత్తులు..100 గ్రాముల పనీర్‌లో సుమారు 15 నుంచి 20 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. పాలు, పెరుగు కూడా జీర్ణక్రియకు, ఎముకల దృఢత్వా నికి ఎంతో మేలు చేస్తాయి. పప్పుధాన్యాలు,మొలకలు.. ఒక కప్పు వండిన పప్పులో దాదాపు 6 నుంచి 9 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది. సెనగలు, రాజ్మా వంటి వాటిలో ప్రొటీన్‌తో పాటు పీచు పదార్థం (fiber) కూడా పుష్కలంగా ఉంటుంది. సోయాబీన్, టోఫు.. శాఖాహారులకు సోయా ఉత్పత్తులు అద్భుతమైన ప్రొటీన్ వనరుగా పనిచేస్తాయి.

నట్స్,సీడ్స్..బాదం, వేరుసెనగలు, గుమ్మడి గింజలు వంటి వాటిలో ప్రొటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అయితే వీటిని పరిమిత పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం. కండరాల నిర్మాణానికి కేవలం ప్రొటీన్ మాత్రమే సరిపోదు. శరీరానికి తగినంత విశ్రాంతి అంటే 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. క్రమబద్ధమైన వ్యాయామం, సమతులాహారం ఎంతో ముఖ్యం. తొందరపాటుతో సత్వర మార్గాలను ఎంచుకోకుండా సహజమైన ఆహారపు అలవాట్లతో క్రమంగా శరీరాకృతిని నిర్మించుకోవడమే నిజమైన ఫిట్‌నెస్‌కు నిదర్శనం.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.