విటమిన్ "ఇ" హెల్త్ బెనిఫిట్స్..?

సాక్షి లైఫ్ : విటమిన్ "ఇ" కొత్త చర్మ కణాలను పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. గోధుమ రంగు మచ్చలను తొలగిస్తుంది. రెగ్యులర్‌గా అప్లై చేస్తే స్ట్రెచ్ మార్క్స్‌ని తగ్గించుకోవచ్చు. విటమిన్ "ఇ"లో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలోనూ, ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మంపై ఫ్రీ రాడికల్స్  హానికరమైన ప్రభావాలను నియంత్రిస్తాయి.

మనం ఏది తిన్నా అందులో విటమిన్లు, మినరల్స్ సహా ఎన్నో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. మన శరీర అభివృద్ధికి ,ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి పోషకాలు చాలా ముఖ్యమైనవి. అయితే, ఆరోగ్యంతో పాటు, కొన్ని విటమిన్లు, మినరల్స్ మన చర్మం, జుట్టుకు కూడా అవసరం. విటమిన్ "ఇ" వీటిలో ఒకటి. ఇది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి, జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతే కాదు, ఇది కంటి ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. చర్మానికి విటమిన్ "ఇ" వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడంలో విటమిన్ "ఇ" కీలక పాత్ర పోషిస్తుంది. చాలామందికి ఇప్పటికీ దాని ప్రయోజనాల గురించి తెలియదు. అవేంటంటే..?  

ఇది కూడా చదవండి.. నిపా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి..?

ఇది కూడా చదవండి.. అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం.. 

ఇది కూడా చదవండి..పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలు డేంజర్

 యాంటీఆక్సిడెంట్స్.. 

విటమిన్ "ఇ" అనేది యాంటీఆక్సిడెంట్లకు మూలం. ఇది అతి నీలిలోహిత  కిరణాల వల్ల కలిగే ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గిస్తుంది. అంతేకాదు సన్‌బర్న్ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. విటమిన్ "ఇ" సన్‌బర్న్ వల్ల కలిగే దురద నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

 
నిరోధించడానికి.. 

విటమిన్ "ఇ" ఎల్లో నెయిల్ సిండ్రోమ్‌ను నివారిస్తుంది. అంతేకాదు పొడి చర్మాన్ని, పొరలుగా ఉండే చర్మాన్ని నిరోధించడానికి లేదా చికిత్స చేయడానికి సహాయపడుతుంది. దీనిని మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. విటమిన్ "ఇ"ని అనేక మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లలో కూడా ఉపయోగిస్తారు.

ఇది కూడా చదవండి..30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : skin-disease immune-system skin-care-tips skin-problems skin-problem skin-infection vitamin-e best-skin-care-products how-to-increase-the-collagen-in-your-skin collagen-for-skin-tightening vitamin-e-capsules-for-skin vitamin-e-for-skin
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com