పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలు డేంజర్

షేర్ చేయండి:
పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలు డేంజర్

సాక్షి లైఫ్ : పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలు ఇవ్వడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్దలతోపాటు చిన్నారులకోసం వాడే ప్లాస్టిక్ బాటిల్స్ ఏమాత్రం ఆరోగ్యం కాదని వారు చెబుతున్నారు.ముఖ్యంగా సాధారణంగా పెద్దలు నీళ్లు తాగడానికి ఉపయోగించే బాటిల్స్ తోనూ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ప్లాస్టిక్ లోని రసాయనాలు..

చిన్నారులకు పాలకు వినియోగించే ప్లాస్టిక్ బాటిల్స్ తో మరిన్ని అనారోగ్య ప్రమాదాలు పొంచి ఉన్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ లో వేడి వేడి పాలు పోయడం వల్ల ప్లాస్టిక్ కణాలు నెమ్మదిగా కరిగి చిన్నారుల కడుపులోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. దీనికారణంగా జీర్ణసంబంధిత సమస్యలతోపాటు వారి మెదడుపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 

వేడి పానీయాలు లేదా ఆహారాలు ప్లాస్టిక్ లో నిల్వ చేయడం కారణంగా ప్లాస్టిక్ లోని రసాయనాలు విడుదల అవుతాయి. అవి మరిన్ని అనారోగ్య సమస్యలను కలిగించే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. పిల్లలకు పాలు ఇవ్వడానికి గ్లాస్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిల్స్ ఉపయోగించడం మంచిదని వారు సూచిస్తున్నారు.   

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.