శరీరంలో ఫైబర్ లోపం వల్ల కలిగే హాని ఏమిటి..?

షేర్ చేయండి:
శరీరంలో ఫైబర్ లోపం వల్ల కలిగే హాని ఏమిటి..?

సాక్షి లైఫ్ : శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో రకాల పోషకాలు కావాలి. డయాబెటిస్‌తో బాధపడేవారిలో ఫైబర్ చాలా ముఖ్యమైందిగా పరిగణిస్తారు. బరువు తగ్గడానికి, గుండె జబ్బుల నుంచి రక్షించడంలో అత్యత కీలక పాత్ర పోషిస్తుంది ఫైబర్. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

  ఇది కూడా చదవండి.. మెదడుకు ఆక్సిజన్ ఎంతసేపటి వరకూ అందకపోతే డ్యామేజ్ అవుతుంది..? 


ఫైబర్ జీర్ణక్రియ విషయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది.


ఫైబర్ లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..?

శరీరానికి కావాల్సినంత పీచుపదార్థం (ఫైబర్ కలిగిన ఆహారం) తీసుకోకపోతే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో కడుపు శుభ్రం అవ్వదు. దీనికారణంగా మొటిమలు లేదా నోటి పూత వంటి సమస్య  తలెత్తవచ్చు. అంతే కాకుండా ఫైబర్ లోపం వల్ల గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం, అసిడిటీ వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. దీనితో పాటు, గుండె సంబంధిత వ్యాధులు, పేగు క్యాన్సర్ ,పైల్స్ సమస్యలు కూడా దీని లోపం వల్ల వస్తాయి. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి..రక్తదానం చేసేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి..?
 
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.