రక్తదానం చేసేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మీరు రక్తదానం చేయాలను కున్నపుడు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పుష్కలంగా నీరు త్రాగండి: హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల సిరలను కనుగొనడం సులభం అవుతుంది. రక్తాన్ని ఇచ్చే సమయంలో లేదా తర్వాత బలహీనత కారణంగా మీకు కళ్లు తిరగడం తగ్గుతుంది. ఖాళీ కడుపుతో ఉండకండి: రక్తదానం చేయడానికి వెళ్లే ముందు భోజనం చేసి వెళ్ళండి. ఇలా చేయడం వల్ల రక్తదానం చేసిన తర్వాత నీరసంగా లేకుండా ఉంటుంది.  ఇలాంటప్పుడు ఎక్కువగా పండ్లు తీసుకుంటే చాలామంచిది.  

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?   

రక్తదానం చేయడానికి ముందు వ్యాయామం చేయండి, తర్వాత కాదు: మీరు ఫిట్‌నెస్ కోసం ప్రతిరోజూ జిమ్ కు వెళుతుంటే రక్తదానం చేసే ముందు మీ వ్యాయామ సెషన్‌ను పూర్తి చేయండి. తర్వాత వ్యాయామం చేయకుండా ఉండటం మంచిది.

ఐరన్ మాత్రలు తీసుకోండి: తరచుగా రక్తదానం చేసే వ్యక్తులు ఐరన్ సప్లిమెంట్లను లేదా ఐరన్‌తో కూడిన మల్టీవిటమిన్‌ను తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. టీనేజర్లు కూడా రక్తదానం చేసిన తర్వాత ఐరన్ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు, ఎందుకంటే రక్తదానం చేసిన తర్వాత వారు కూడా ఐరన్ లోపం తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి.. రక్తదానం చేయడం వల్ల నిజంగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చా..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.