జింక్ లోపంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే..? 

షేర్ చేయండి:

సాక్షిలైఫ్ : జింక్ మన శరీరంలోని అనేక ముఖ్యమైన విధుల్లో సహాయపడే ముఖ్యమైన పోషకం. దీనిలోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో జింక్ అధికంగా ఉండే వాటిని చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉంచడంలో జింక్ పాత్ర చాలా కీలకమైంది.  

జింక్ లోపిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి..?  

రోగనిరోధక శక్తి తగ్గుతుంది. శరీరంలో ఎక్కడైనా గాయాలు అయితే నయం కావడానికి చాలా సమయం పడుతుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా జింక్ అవసరం. జింక్ లోపం కళ్లను బలహీనపరుస్తుంది. దృష్టిలోపాలు వస్తాయి. 

 జింక్ లోపిస్తే లక్షణాలు ఎలా ఉంటాయి..? 

మగవారిలో వంధ్యత్వ సమస్యలు 
జుట్టు రాలు సమస్య 
బాగా అలసటగా అనిపిస్తుంది
గాయాలు చాలా  నెమ్మదిగా నయం అవుతాయి
బరువు పెరుగుతారు
వాసన,రుచి తగ్గుతుంది
ఆకలి తగ్గుతుంది
తరచుగా అనారోగ్యానికి గురవుతారు
కంటి చూపు తగ్గుతుంది
పిల్లల్లో ఎదుగుదల తగ్గుతుంది

ఇది కూడా చదవండి.. బరువు తగ్గించే ఏబీసీ జ్యూస్..ఇదిగో..! 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.