గుండెపోటు ప్రమాదాన్ని పెంచే ఆహారపు అలవాట్లు..   

షేర్ చేయండి:
గుండెపోటు ప్రమాదాన్ని పెంచే ఆహారపు అలవాట్లు..   

సాక్షి లైఫ్ : అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల నేడు చిన్నవయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. ఒకప్పుడు గుండె జబ్బులను వృద్ధుల సమస్యగా భావించేవారు కానీ నేడు అలా కాదు. యువతలోనే ఎక్కువగా కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడంతోపాటు, జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా చిన్నవయస్సులోనే గుండె జబ్బులు వస్తున్నాయని చెబుతున్నారు వైద్యనిపుణులు. వీటిని నివారించడం ద్వారా ఎలాంటి జబ్బులు రాకుండా ఉండొచ్చని వారు వెల్లడిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

ఇది కూడా చదవండి.. ఔషధాలతో పని లేకుండా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చా..?

ఇది కూడా చదవండి..ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?

ఇది కూడా చదవండి..ఆందోళన కలిగిస్తున్న ఎం పాక్స్ కొత్త వేరియంట్.. 

ఇది కూడా చదవండి..మందులతో పనిలేకుండా అధికరక్తపోటు ఎలా తగ్గుతుంది..?

గుండెపోటు ప్రమాద కారకాలు..  
 
తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఊబకాయంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా శరీరంలో కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు సంబంధించిన సమస్యలను కలిగిస్తాయి.

 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు గుండె జబ్బులు కారణమవుతున్నాయి. నేడు చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురవుతున్న నేపథ్యంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం. గుండెకు చాలా హాని కలిగించే కొన్ని రోజువారీ ఆహారపు అలవాట్ల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ రోజువారీ ఆహారపు అలవాట్లు గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ప్రేరేపిస్తాయి. అంతేకాదు అనేక ఇతర తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతాయి.

 అధిక ఉప్పు.. 

అధిక ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది, ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణం. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఆహారంలో తాజా ఆహారాన్ని చేర్చడానికి ప్రయత్నించండి. మీ ఆహారంలో ఉప్పు మొత్తాన్ని తగ్గించడానికి, మీరు ప్రత్యామ్నాయంగా కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలను కూడా వినియోగించాలి.

 ప్రోటీన్ ఫుడ్.. 

శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది, కానీ దానిని అధిక మోతాదు తీసుకుంటే మూత్రపిండాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్నిపెంచుతుంది. అటువంటి పరిస్థితిలో మాంసం, చేపలు, పౌల్ట్రీ ,పాల ఉత్పత్తులను పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. వీటికి బదులుగా, తృణధాన్యాలు, బీన్స్, టోఫు మొదలైన మొక్కల ఆధారిత ప్రోటీన్ ఫుడ్ ను ఎంచుకోవడం ఉత్తమం.
 
చక్కెర.. 

అధిక చక్కెర వినియోగం కారణంగా బరువు పెరగడంతో పాటు,టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి. సోడా, మిఠాయిలు, పేస్ట్రీలు , ఇతర తీపి పదార్థాలు రుచికరంగా ఉండవచ్చు, కాబట్టి వాటిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. వీటికి  బదులుగా వీలైనంత వరకు ఫైబర్ అధికంగా ఉండే తాజా పండ్లను తినండి.

 కొవ్వులు.. 

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) మొత్తాన్నిపెంచడంలో సంతృప్త ,ట్రాన్స్ ఫ్యాట్‌లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే రెడ్ మీట్, ఫ్యాటీ డైరీ ప్రొడక్ట్స్ ,హైడ్రోజనేటెడ్ ఆయిల్స్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలను పరిమిత పరిమాణంలో తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. వీటికి బదులుగా వాల్‌నట్స్, బాదంపప్పులు, ఆలివ్ ఆయిల్ , అవకాడో వంటి మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉన్న ఆహారపదార్థాలను ఎంచుకోవచ్చు.

అల్పాహారం.. 

 తరచుగా అల్పాహారం మానేసే అలవాటు ఉంటే, ఇది మీ బ్లడ్ షుగర్‌ని కూడా పాడు చేస్తుంది. దీనికారణంగా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన అల్పాహారం రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్‌గా ఉంచడంలో సహాయపడటమే కాకుండా రోజులో అతిగా తినడం నివారించడంలో సహాయపడుతుంది.

ఈ అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండడం ద్వారా, మీరు గుండె జబ్బులను నివారించవచ్చు. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం ,ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా ఎలాంటి రోగాలు లేకుండా ఉండొచ్చు.

ఇది కూడా చదవండి..జీవనశైలి, ఆహారం హోమియోపతి చికిత్సల ప్రభావాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

ఇది కూడా చదవండి..హోమియోపతి చికిత్స ద్వారా ఎలాంటి వ్యాధులు తొందరగా నయమవుతాయి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.