ఆందోళన కలిగిస్తున్న ఎం పాక్స్ కొత్త వేరియంట్..
సాక్షి లైఫ్ : ఎంపాక్స్(మంకీ పాక్స్) వైరస్ కొత్త వేరియంట్.. క్లాడ్ IB, ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. వేగంగా వ్యాప్తి చెందడంతో జనాల్లో వణుకు పుడుతోంది. ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్ కు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. దీనికి సంబంధించి పలురకాల పరిశోధనలు చేపట్టారు శాస్త్రవేత్తలు. రోగితో సన్నిహిత సంబంధం ఉండడం వల్లనే కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. కొత్త వేరియంట్ ఆఫ్రికాలోని అనేక దేశాలకు వ్యాపించింది. Mpox కొత్త వేరియంట్ కేసులు కాంగో, స్వీడన్ , థాయిలాండ్‌లో కూడా నమోదయ్యాయి. ఎంపాక్స్ కొత్త వేరియంట్.. ఇది సోకిన వారితో దగ్గరగా ఉండడం వల్ల వేగంగా వ్యాప్తి చెందుతుంది.
ఇది కూడా చదవండి..మంకీపాక్స్ కేసుల నివారణకు హైదరాబాద్ లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ విషయంలో ముఖంపై ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యానికి హాని కలిగించే 156 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్‌ను నిషేధించిన కేంద్ర ఆరోగ్య శాఖ
కాంగోలో వేగంగా వ్యాపించిన తర్వాత, Mpox దాని పొరుగు దేశాలకు వ్యాపించింది. ఆఫ్రికానే కాకుండా, మొదటిసారిగా యూరప్, పాకిస్తాన్‌లో కూడా కేసులు నమోదయ్యాయి. Mpox రెండేళ్లలో రెండవసారి రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే, ఇప్పుడు MPOX కొత్త వేరియంట్ కనుగొన్నారు.
గ్లోబల్ హెల్త్ అధికారులు ఆగస్టు 15న స్వీడన్‌లో mpox వైరస్ కొత్త వేరియంట్ కేసు నమోదైంది. ఇది ఆఫ్రికా ఖండం బయట వ్యాప్తి చెందిందనడానికి మొదటి సంకేతం. థాయ్‌లాండ్‌లో నమోదైన ఒక Mpox కేసు వైరస్ క్లాడ్ IB వేరియంట్ గా నిర్ధారించారు. ఇది దేశంలోనే మొదటిదని థాయ్ వ్యాధి నియంత్రణ అధికారి ఆగస్టు 22న తెలిపారు. ఈ కేసు మొదట ఆగస్టు 21 న నమోదైంది. ఇది ఆఫ్రికన్ దేశం నుంచి వచ్చిన 66 ఏళ్ల యూరోపియన్ వ్యక్తి అని థాయిలాండ్ తెలిపింది.
ఆగస్టు 18 నాటికి, బురుండిలో 153 క్లాడ్ IB MPOX కేసులు ఉన్నాయి. ఎవరూ చనిపోలేదు. WHO డేటా ప్రకారం, గత రెండు వారాల్లో దేశంలో 113 క్లాడ్ IB MPOX కేసులు నమోదయ్యాయి. జూలై 29న, కెన్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్లాడ్ IB mpox కేసును ధృవీకరించింది, ఇది దేశంలో మొట్టమొదటి mpox కేసు. WHO డేటా ప్రకారం, ఆగస్టు 8 వరకు ఈ వ్యాధి కారణంగా ఎవరూ చనిపోలేదు.
ఇది కూడా చదవండి..తుంటి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఎంత త్వరగా నడక ప్రారంభించవచ్చు..?
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
