దోమల ద్వారా ఎలాంటి వ్యాధులు సంక్రమిస్తాయి..?

షేర్ చేయండి:
దోమల ద్వారా ఎలాంటి వ్యాధులు సంక్రమిస్తాయి..?

సాక్షి లైఫ్ : భూమి మీద మనుషుల కంటే ఎక్కువ రకాల దోమలు ఉన్నాయని మీకు తెలుసా? మీ రక్తాన్ని పీల్చే దోమల్లో అనేక రకాలున్నాయి. అటువంటి వాటిలో 3,500పైగా దోమ జాతులున్నాయి. ఆ సంఖ్య సరిగ్గా ఎలా ఉంటుందంటే100 ట్రిలియన్ దోమలను ఫుట్‌బాల్ మైదానంలో పేర్చినట్లయితే, ఆ కుప్ప మూడు మైళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అంత పెద్దదిగా ఉంటుంది. 

ఇది కూడా చదవండి..ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 
సగటు దోమ జీవితకాలం.. 

 భూమి మీద అత్యంత ప్రాణాంతకమైన జాతులలో ఒకటి దోమలు. సంభోగం తర్వాత, ఒక మగ దోమ సాధారణంగా మూడు నుంచి ఐదు రోజులు మాత్రమే జీవిస్తుంది. ఒక ఆడ దోమ ఒక నెల లేదా రెండు నెలల వరకు జీవించగలదు. ఆ సమయంలో ఆడదోమలు ప్రతి మూడు వారాలకు గుడ్లు పెడతాయి.

దోమల శరీర ఉష్ణోగ్రతలు వాటి ప్రస్తుత స్థానానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోగలుగుతాయి. ముఖ్యంగా ఇవి మానవులశరీర తత్వంతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. అందుకే ఇతర కీటకాల కంటే దోమలు సంవత్సరంలో వేడిగా ఉండే సమయాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. సమశీతోష్ణ ప్రాంతాలలో ఉండే దోమలు చాలా నిద్రాణస్థితిలో ఉంటాయి.

 దోమలు మొదటి 10 రోజులు నీటిలో గడుపుతాయి.. 

దోమలకు నీరు చాలా అవసరం, ఎందుకంటే అవి సాధారణంగా తమ నివాసాలను నీళ్లలోనే ఏర్పరుస్తాయి. అవి వాటి గుడ్లను లార్వాగా మార్చుతాయి, వీటిని విగ్లర్స్ అని పిలుస్తారు. ఈ విగ్లర్లు ప్రాథమికంగా ఒకేచోట ఉండే నీటిలోని సేంద్రీయ పదార్థాలను తింటాయి. నీటిలోని ఆక్సిజన్‌ను పీల్చుకుంటాయి. 


- జికా వైరస్

- మలేరియా

- వెస్ట్ నైల్ వైరస్

-డెంగ్యూ జ్వరం

- పసుపు జ్వరం

-చికున్‌గున్యా

- ఇన్ఫ్లుఎంజా వంటివి వ్యాధులు దోమల ద్వారా మనుషులకు సోకుతాయి. కాబట్టి దోమ కాటుకు గురికాకుండా ఉండడానికి అవసమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. 

 ఇది కూడా చదవండి.. టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.