సాక్షి లైఫ్ : ఇటీవల మారిన జీవన శైలితోపాటు ఆహారపుఅలవాట్ల కారణంగా సైనసైటిస్ సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. సైనస్ ప్రాబ్లమ్ ఉన్నవారు చల్లని పానీయాలు అస్సలు తీసుకోకూడదు. వేడి పానీయాలు మాత్రమే తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సైనస్ సమస్య ఉంటే హాట్ వాటర్ తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. హాట్ వాటర్ తాగడం వల్ల మూసుకుపోయిన ముక్కు క్లియర్ అవుతుంది.
సైనస్ సమస్య ఉన్నవారికి తరచుగా ముక్కు కారుతున్న సమయంలో ఆవిరి తీసుకోవడం వల్ల కొంతమేర ఉపశమనం కలుగుతుంది. నాసికా రంధ్రాలు మూసుకుపోయినట్లు అనిపించినా కూడా ఆవిరి పట్టడంవల్ల సమస్య తాత్కాలికంగా కొంత వరకు పరిష్కారం అవుతుంది.
ఇది కూడా చదవండి..ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారా..?
మద్యం సేవించడం వల్ల సైనస్ సమస్యలు మరింతగా పెరుగుతాయి. కాబట్టి పొరపాటున కూడా మద్యం తీసుకోకపోవడం మంచిది. చల్లని గాలి, చల్లని నీరు, చల్లని పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు చల్లని నీటితో కూడా తలస్నానం చేయవద్దని వారు చెబుతున్నారు.
అసలు సైనసిటిస్ అనేది ఎన్నిరకాలున్నది..? క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? ఈ రెండిటిలో ఏది తీవ్రమైంది..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డా. మొయినుద్దీన్ మహమ్మద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..
ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com