హైపోగ్లైసీమియా అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : భారతదేశంలో షుగర్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చక్కెర పెరుగుదల ఎంత ప్రమాదకరమైనదో, చక్కెర తగ్గడం కూడా అంతే ప్రమాదకరమని మీకు తెలుసా..? చక్కెర స్థాయి పెరిగిన వ్యక్తులు దానిని నియంత్రించడానికి మందులు తీసుకుంటారు. చక్కెర స్థాయిలు తక్కువగా ఉండడాన్నే "హైపోగ్లైసీమియా" అంటారు. రక్తంలో చక్కెర స్థాయి 70 mg/DL కంటే తక్కువగా ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితిని హైపోగ్లైసీమియాగా పరిగణిస్తారు.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
హైపోగ్లైసీమియా అనేది ఒక సమస్య, దీని కారణంగా బాధితులకు తల తిరుగుతున్నట్లు, నీరసంగా అనిపించడం, చెమటలు పడుతున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఈ సమస్య కారణంగా మూర్ఛపోయే అవకాశం కూడా ఉందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయి 70 mg / DL కంటే తక్కువగా ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితిని హైపోగ్లైసీమియా లేదా లో బ్లడ్ షుగర్ అంటారు. శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ అసమతుల్యత కారణంగా హైపోగ్లైసీమియా సంభవిస్తుందని వైద్యనిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
