చిన్నారుల్లో నులి పురుగులు రావడానికి కారణాలు..?
సాక్షి లైఫ్ : పిల్లల్లో నులిపురుగులు రావడానికి ప్రధాన కారణం శుభ్రత లేకపోవడమే. దుమ్ము, ధూళి, మట్టిలో ఆడుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకోసమే పిల్లల చేతిగోర్లను శుభ్రంగా ఉంచేలా తల్లిదండ్రులు చూసుకోవాలి.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఆడుకునే సమయంలో..
భోజనం చేసేటప్పుడు, మూత్ర, మల విసర్జన అనంతరం చేతులు శుభ్రం చేసుకోవడం పిల్లలకు నేర్పించాలి. పిల్లలు మట్టి, బురదలో ఆడుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేయించాలి. ఆడుకునే సమయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
నులిపురుగుల ప్రభావం పిల్లల ఆరోగ్యంగాపై తీవ్రంగా చూపిస్తుంది. అంతేకాదు ఇవి పిల్లల శారీరక, మానసిక పెరుగుదలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. రక్తహీనత, పోషకాల లోపం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు అవుతాయి.
ఎలా నిర్మూలించవచ్చు..?
ఈ సమస్యల కారణంగా పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టలేరు. ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. వీటి వల్ల ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది. అందుకోసమే పిల్లలందరూ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.ఏడాది వయసున్న పిల్లలతోపాటు19 ఏళ్ల వయసున్న వారికి కూడా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ తప్పనిసరిగా అందించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
