డైజెస్టివ్ ఎంజైమ్‌లు అధికంగా ఉండే ఆహారాలు..  

షేర్ చేయండి:
డైజెస్టివ్ ఎంజైమ్‌లు అధికంగా ఉండే ఆహారాలు..  

సాక్షి లైఫ్ : అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం వల్ల కడుపులో గ్యాస్ సమస్య తలెత్తుతుంది. పండుగ రోజులలో ప్రజలు మిఠాయిలు, పిండి వంటకాలను ఎక్కువగా ఆస్వాదిస్తారు. అందువల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. అరుగుదల శక్తి తక్కువగా ఉన్నప్పుడు కూడా తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చు. కాబట్టి జీర్ణ శక్తిని పెంచుకోవాల్సినఅవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..? 

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

కివి.. 

ఇందులో ప్రొటీయోలైటిక్ అనే ఎంజైమ్ ఇందులో ఉంటుంది. ఇది ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో ఉండే ఫైబర్ పేగు మంట, మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఆపిల్.. 

యాపిల్‌లో పెక్టిన్‌తో పాటు కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుంది.

బొప్పాయి.. 

ఇందులో పాపైన్ ఎంజైమ్ ఉంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడం ద్వారా మెరుగైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది.

అవకాడో.. 

అవోకాడోలో లిపేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కొవ్వు జీర్ణక్రియను నిర్వహించడం ద్వారా పోషణలో సహాయపడుతుంది.

అరటిపండు.. 

ఇందులో అమైలేస్, గ్లూకోసిడేస్ అనే ఎంజైములు ఉన్నాయి. ఇవి చక్కెరను జీర్ణం చేయడంలో సహాయపడతాయి. రోజూ ఒక అరటిపండు తినడం వల్ల పొట్టలోని జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

పైన్ ఆపిల్..

బ్రోమెలైన్ అని పిలిచే ఎంజైమ్‌ల సమూహం ఇందులో ఉంటుంది. ఇది ప్రోటీన్‌లను అమైనో ఆమ్లాలుగా వేరు చేయడంలో సహాయపడుతుంది. దీంతో ప్రొటీన్‌ను జీర్ణం చేసుకునే శక్తి కూడా పెరుగుతుంది.

తేనె.. 

డయాస్టేజ్, ఇన్వర్టేజ్, ప్రోటీజ్ అనే ఎంజైమ్‌లు ఇందులో ఉన్నాయి. ఇవి శరీరంలోని చక్కెర ,ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేయడం ద్వారా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

అల్లం.. 

ఇందులో ఉండే జింగిబైన్ ఎంజైమ్ ప్రొటీన్లను జీర్ణం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇది కూడా చదవండి.. ఒక వారంలో ఎన్ని గంట‌లు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.