Breakfast : ఈ 3 పదార్థాలతో చేసే అల్పాహారంతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం లేవగానే టీ, బిస్కెట్లతో రోజును ప్రారంభించే బదులు పెసలు, పల్లీలు, ఎండుద్రాక్షలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోజంతా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. సులభంగా లభించే ఈ మూడు పదార్థాలతో తయారు చేసే అల్పాహారం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఉదయం పూట తీసుకునే ఈ మూడు ముఖ్యమైన ఆహార పదార్థాలు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి.

 

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

పెసలు (Moong)..

పెసలలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి, ఆకలి త్వరగా వేయదు. ప్రోటీన్ కండరాల దృఢత్వానికి, రోజువారీ పనులకు అవసరమైన శక్తిని ఇస్తుంది. వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవడం చాలా మేలు.

వేరుశనగలు (Peanuts)..

పల్లీలలో ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు (Healthy fats) ఉంటాయి. ఉదయం పూట వీటిని కొద్దిగా తీసుకుంటే శరీరానికి దీర్ఘకాలిక శక్తి లభిస్తుంది. నానబెట్టిన పెసలతో కలిపి తింటే రుచితో పాటు పోషకాల సమతుల్యత మెరుగుపడుతుంది.

ఎండుద్రాక్ష (Raisins)..

ఉదయాన్నే తీపి తినాలనిపించే వారికి కిస్‌మిస్ మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ఐరన్, పొటాషియం, ఫైబర్ మెండుగా ఉంటాయి. రాత్రి నీళ్లలో నానబెట్టిన కిస్‌మిస్‌ను అల్పాహారంలో కలుపుకోవడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు దరిచేరవు.

తయారీ విధానం

రాత్రి నిద్రపోయే ముందు పెసలు, పల్లీలను వేర్వేరు గిన్నెల్లో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే నీటిని వంపేసి వాటిని శుభ్రంగా కడగాలి. ఈ మిశ్రమానికి ముందుగా నానబెట్టిన ఎండుద్రాక్షను యాడ్ చేయాలి. మరింత రుచి కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, కొద్దిగా నిమ్మరసం, చాట్ మసాలా జోడించి ఆరోగ్యకరమైన చాట్‌లా ఆస్వాదించవచ్చు. ప్రతి ఒక్కరి శరీర తత్వం ఒకేలా ఉండదు. మీకు పల్లీలు వంటి వాటితో ఏదైనా ఎలర్జీ ఉన్నా, లేదా ఏదైనా అనారోగ్య సమస్యతో ప్రత్యేకమైన డైట్ పాటిస్తున్నా.. ఆహారంలో ఈ మార్పులు చేసే ముందు వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.