Diabetes-Friendly Fruits: మధుమేహులు నిర్భయంగా తినదగిన పండ్లు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మధుమేహం (diabetes) ఉన్నవారు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పండ్ల విషయంలో చాలా అపోహలు ఉంటాయి. పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉన్న పండ్లను మితంగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహ సమస్య ఉన్నవారు కూడా నిర్భయంగా తినదగిన పండ్లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?


ఆపిల్ (Apple)..

ఆపిల్ పండ్లలో ఫైబర్ తో పాటు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేసి, రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది. జ్యూస్ కంటే తొక్కతో సహా నేరుగా తినడం మంచిది.

జామ (Guava)..

ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉండే జామకాయ మధుమేహులకు మంచి స్నాక్. ఇది కడుపు నిండిన భావననిచ్చి ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. ఉప్పు, చక్కెర లాంటివి అదనంగా కలపకుండా ముక్కలుగా కోసుకుని తినాలి.

బేరి పండు (Pear)..

బేరి పండులో కూడా ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేస్తుంది. భోజనం తర్వాత షుగర్ లెవల్స్ వేగంగా పెరగకుండా ఆపుతుంది. దీనిని సలాడ్స్ లో కూడా కలుపుకుని తీసుకోవచ్చు.

కమలాఫలం (Orange)..

విటమిన్ సి, ఫైబర్, నీటి శాతం మెండుగా ఉండే కమలాఫలం మధుమేహులకు ఎంతో మేలు చేస్తుంది. అయితే ప్యాకేజ్డ్ జ్యూస్ లు తీసుకుంటే అదనపు చక్కెరలు శరీరంలోకి వెళ్తాయి కాబట్టి, నేరుగా తొనలు తినడమే సరైన పద్ధతి.

నేరేడు పండు (Jamun)..

సాంప్రదాయకంగా డయాబెటిస్ నియంత్రణలో నేరేడు పండును ఒక ఔషధంగా భావిస్తారు. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, షుగర్ కోసం మందులు వాడేవారు నేరేడు సప్లిమెంట్లను తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.

కివీ (Kiwi)..

జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్ తో పాటు, విటమిన్ సి కివీలో మెండుగా ఉంటుంది. కివీ పండ్లను స్మూతీలు లేదా షేక్స్ రూపంలో కాకుండా నేరుగా ముక్కలుగా తీసుకోవడం ఆరోగ్యకరం. పండ్లను జ్యూస్ రూపంలో కంటే ముక్కలుగా తినడానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఒకేసారి ఎక్కువగా కాకుండా మితంగా తీసుకోవడం, డాక్టర్ సలహా మేరకు డైట్ ను ఫాలో అవ్వడం చాలా ముఖ్యం.

 

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి.. గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

ఇది కూడా చదవండి..స్పాండిలోసిస్ సమస్యలు - పరిష్కార మార్గాలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.