Lp-a : లిపోప్రొటీన్-ఏ (Lp-a) అంటే ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కొలెస్ట్రాల్, బీపీ, బరువు అన్నీ సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ కొంతమంది అనూహ్యంగా గుండెపోటు బారిన పడుతుంటారు. దీనికి ప్రధాన కారణం రక్తంలో దాగి ఉండే 'లిపోప్రొటీన్-ఏ' (Lp-a) అని, ఇది మనం చేయించుకునే సాధారణ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల్లో బయటపడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

 

లిపోప్రొటీన్-ఏ (Lp-a) అంటే ఏమిటి..?

ఇది రక్తంలో కొలెస్ట్రాల్‌ను మోసుకెళ్లే ఒక రకమైన కణం. బ్యాడ్ కొలెస్ట్రాల్ రకం. కాలేయంలో ఉత్పత్తి అయ్యే దీని స్థాయిలు పూర్తిగా జన్యువుల ద్వారానే నిర్ధారిత మవుతాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2026 నూతన మార్గదర్శ కాల ప్రకారం, ప్రతి ఐదుగురిలో ఒకరికి కొలెస్ట్రాల్‌ స్థాయిలు అధికంగా ఉంటున్నాయి. దీని సాధారణ స్థాయి 30 mg/dL (లేదా 75 nmol/L) కంటే తక్కువ ఉండాలి. ఈ స్థాయి దాటితే గుండెకు పొంచి ఉన్న ముప్పుగా భావించాలి.

ప్రమాదకరం ఎందుకు..?

జీవనశైలికి అతీతం.. ఆహారపు అలవాట్లు, కఠినమైన వ్యాయామం, జీవనశైలి మార్పులతో దీని స్థాయిలను అదుపు చేయడం సాధ్యం కాదు. నిశ్శబ్ద గండం..శరీరంలో ఎంత ఫిట్‌గా ఉన్నా, రక్తనాళాల్లో పూడికలు, వాపు, రక్తపు గడ్డలు ఏర్పడేలా చేసి అకస్మాత్తుగా గుండెపోటు, స్ట్రోక్‌లకు దారితీస్తుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ బాబ్ హార్పర్ 51 ఏళ్ల వయసులో అత్యంత ఫిట్‌గా ఉండి కూడా గుండెపోటుకు గురయ్యారు. ఆయనలో జన్యుపరంగా ఉన్న ఈ Lp-a సమస్యే అందుకు కారణమని వైద్యులు తేల్చారు.

ఈ పరీక్ష ఎవరు చేయించుకోవాలి..?

కార్డియాలజిస్టుల సూచనల ప్రకారం, ప్రతి వయోజనుడు జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా కొందరు తప్పనిసరిగా జాగ్రత్తపడాలి. కుటుంబంలో తల్లిదండ్రులు లేదా బంధువులకు చిన్న వయసులోనే గుండెపోటు వచ్చిన చరిత్ర ఉన్నవారు. యుక్త వయసులోనే గుండెపోటు లేదా స్ట్రోక్ బారిన పడినవారు. వంశపారంపర్యంగా అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు. కాళ్లలో రక్తప్రసరణ సరిగా జరగని సమస్య (Peripheral Artery Disease) ఉన్నవారు.

చికిత్స - ముందు జాగ్రత్తలు..

ప్రస్తుతానికి Lp-aను నేరుగా తగ్గించే నిర్దిష్టమైన మందులు మార్కెట్లో లేవు. అయితే, లివర్‌లో దీని ఉత్పత్తిని అడ్డుకునే కొన్ని కొత్త ఔషధాలపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అప్పటివరకు, మధుమేహం, బీపీని కఠినంగా అదుపులో ఉంచుకోవడం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా గుండెపై పడే అchoదనపు భారాన్ని తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.