Back Pain : వెన్నునొప్పిని పోగెట్టే సింపుల్ హోమ్ రెమిడీస్..    

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గాయం లేదా ప్రమాదం కారణంగా కండరాలపై ఒత్తిడి కారణంగా కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎక్కువసేపు కుర్చునేవారిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంతేకాదు ఎముక చిట్లడం లేదా ఆర్థరైటిస్ వల్ల కూడా నొప్పి రావచ్చు. కొంతమందికి వెన్ను పైభాగంలో నొప్పి వస్తుంది. ఈ నొప్పి మెడ ,పక్కటెముక మధ్య ఎక్కువగా వస్తుంది. నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు కొందరిలో కాలక్రమేణా పెరుగుతాయి. ఈ సమస్య పరిష్కారానికి ఇంటి చిట్కాలు ఎంతగానో ఉపశమనం పొందవచ్చు. అవేంటంటే..?  

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

ఆవాల నూనె- పసుపు.. 

నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఆవనూనె,పసుపు చాలాబాగా పనిచేస్తాయి. ఆవాల నూనెను వేడి చేసి, పసుపు వేసిన పేస్ట్‌ను ఉదయం, సాయంత్రం వీపుపై రాయడం వల్ల కండరాల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. అంతేకాదు పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కండరాల నొప్పిని తగ్గించడానికి, ఈ ఆవాల నూనె- పసుపు రెమెడీని ఒక వారంరోజుల పాటు ప్రయత్నిస్తే ప్రభావం కనిపిస్తుంది.

 వెల్లుల్లి.. 

వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కల్పించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది కండరాలతోపాటు, ఎముకలలో నొప్పిని తగ్గిస్తుంది. వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ ముక్కలను ఆవాల నూనెలో వేసి కాస్త వేడి చేసి, ఈ నూనెతో వీపుపై ఏ ప్రాంతంలో నొప్పి ఉందో అక్కడ మసాజ్ చేయండి. ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. 

అల్లం నూనె.. 

అల్లం కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దాని సహాయంతో, కండరాలలో నొప్పి, వాపు తగ్గుతుంది. అల్లంను గ్రైండ్ చేసి రసం తీయండి. ఈ రసాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో రాయండి. తద్వారా పెయిన్ తగ్గుతుంది. 

 అల్లం నూనె కూడా మార్కెట్‌లో దొరుకుతుంది. అల్లం నూనెను కొబ్బరి నూనెతో వేడి చేసి నొప్పిఉన్న దగ్గర రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. రాత్రి పడుకునే ముందు అల్లం నూనెతో మర్దన చేస్తే నొప్పి త్వరగా తగ్గిపోతుంది.

 ఆహారంలో ప్రోటీన్, పిండి పదార్థాలు అవసరం.. 

మీ వెన్ను నొప్పిగా అనిపిస్తే, మీ ఆహారాన్ని మార్చుకోండి. మీ ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి. గుడ్లు, సోయా, పాలు మొదలైనవి మీరోజువారి ఫుడ్ మెనూలో ఉండేలా చూసుకోవడం మేలు.

 అంతే కాకుండా నట్స్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆరెంజ్, బ్లాక్‌బెర్రీస్ వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలను కూడా డైట్‌లో భాగం చేసుకోవచ్చు.

 ఆపిల్ సైడర్ వెనిగర్ నొప్పి.. 

ఒక గ్లాసు నీటిలో కొన్ని చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ కలపండి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో రాయండి. కండరాల నొప్పి నుంచి ఉపశమనానికి ఇది సమర్థవంతమైన పరిష్కారం. యాపిల్ వెనిగర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఆర్థరైటిస్‌లో నొప్పికి చికిత్స చేయడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ను వినియోగిస్తారు.

 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.