Lose Weight : జీలకర్ర నీళ్లు తాగినంత మాత్రాన.. బరువు తగ్గుతారా..?
సాక్షి లైఫ్ : రోజూ ఉదయాన్నే పరగడుపున జీలకర్ర నీళ్లు తాగడం ఈ మధ్యకాలంలో చాలామంది దినచర్యలో భాగమైంది. ఇది బరువు తగ్గడానికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి, శరీరాన్ని డిటాక్స్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందని సామాజిక మాధ్యమాల్లో ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే, ఇది అందరిపైనా ఒకేలా పనిచేస్తుందా..? ఈ నీటిని డైట్లో చేర్చుకునే ముందు దాని వల్ల కలిగే లాభాలు, నష్టాలు తెలుసుకోవడం ముఖ్యం.
జీలకర్ర నీటితో కలిగే ప్రయోజనాలు..
జీలకర్రలో ఉండే సహజసిద్ధమైన సమ్మేళనాలు జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతాయి. కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తాయి. అయితే, జీర్ణ సంబంధిత సమస్యలు దీర్ఘకాలంగా వేధిస్తుంటే వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమం.
ఉదయాన్నే ఒక గ్లాసు జీలకర్ర నీళ్లు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఎలాంటి చక్కెరలు, క్యాలరీలు ఇచ్చే పదార్థాలు కలపకుండా తీసుకుంటే ఇది అద్భుతమైన పానీయంగా పనిచేస్తుంది.
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..Ferritin Face : 'ఫెర్రిటిన్ ఫేస్' అంటే ఏమిటి..? ఎలాంటివారికి వస్తుంది..?
ఇది కూడా చదవండి..ICMR’s New Dietary Guidelines : ఐదు నుంచి 18 ఏళ్ల వారు ఏం తినాలి..? ICMR కొత్త మార్గదర్శకాలు ఇవే..
జీలకర్ర నీళ్లు తాగినంత మాత్రాన అమాంతం బరువు తగ్గిపోతారనుకోవడం అపోహ. కేవలం ఈ నీటి వల్లే బరువు తగ్గలేరు. సరైన పోషకాహారం, క్యాలరీల నియంత్రణ, క్రమం తప్పని వ్యాయామంతో పాటు దీనిని తీసుకున్నప్పుడే సత్ఫలితాలు ఉంటాయి.
అతిగా తీసుకుంటే పొంచివున్న ముప్పు..
ఆరోగ్యానికి మంచిది కదా అని మోతాదుకు మించి జీలకర్ర నీటిని తీసుకుంటే కడుపులో మంట, గ్యాస్, ఇతర అసిడిటీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా తగ్గించే గుణం జీలకర్రకు ఉంటుంది. కాబట్టి, మధుమేహానికి మందులు వాడుతున్నవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకునే ముందు కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. గర్భవతులు లేదా ఏదైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇలాంటి ఇంటి చిట్కాలను రోజువారీగా పాటించే ముందు తప్పనిసరిగా తమ వైద్యుడిని సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
