Ferritin Face : 'ఫెర్రిటిన్ ఫేస్' అంటే ఏమిటి..? ఎలాంటివారికి వస్తుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ముఖంపై నల్లటి మచ్చలు, పాలిపోయిన పెదాలు, కళ్ల కింద నల్లటి వలయాలు, నిర్జీవంగా కనిపించే చర్మం... ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నారు. వీటన్నింటినీ 'ఫెర్రిటిన్ ఫేస్‌' అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది శాస్త్రీయంగా నిర్ధారితమైన వైద్య పరిభాష కాకపోయినా, దీని వెనుక ఉన్న కారణం మాత్రం అందరూ తెలుసుకోవాల్సిందే.

 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..

 

ప్రపంచవ్యాప్తంగా ముగ్గురిలో ఒకరికి ఐరన్ లోపం..

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి ఐరన్ లోపం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి కారణం శరీరంలో ఐరన్‌ను నిల్వ చేసే ఫెర్రిటిన్ అనే ప్రొటీన్ స్థాయిలు తగ్గడమే. ఇదే చర్మంపై ఈ మార్పులకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ లక్షణాలు గమనించారా..?

జుట్టు రాలడం, తీవ్రమైన అలసట, నోటిలో అంగిలి పగలడం, కొద్దిపాటి శ్రమకే ఊపిరి అందకపోవడం వంటివి ఫెర్రిటిన్ లోపానికి ప్రధాన సంకేతాలు.

సాధారణ రక్త పరీక్షలో తెలియదు..!

విశేషమేమిటంటే, ఫెర్రిటిన్ స్థాయిలు మామూలు రక్త పరీక్షల్లో బయటపడవు. దీని కోసం ప్రత్యేకంగా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.

ఐరన్ ఎందుకంత ముఖ్యం..?

రక్త కణాలు ఆక్సిజన్‌ను శరీరమంతా చేరవేయాలన్నా, కండరాలు సక్రమంగా పనిచేయాలన్నా, జుట్టు పెరగాలన్నా, హార్మోన్ల ఉత్పత్తి సవ్యంగా జరగాలన్నా ఐరన్ తప్పనిసరి.

ముందు పరీక్ష.. తర్వాతే చికిత్స..

చర్మ సమస్యలు కనిపించగానే నేరుగా క్రీములు, చికిత్సల వెంట పరుగెత్తే బదులు, ఒకసారి ఫెర్రిటిన్ స్థాయిలను పరీక్షించుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. లోపం గుర్తించి, తగిన ఆహారం లేదా వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు తీసుకుంటే చర్మ సమస్యలతోపాటు మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

 

ఇది కూడా చదవండి..  ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.