Lymphoma: లింఫోమాను సకాలంలో గుర్తిస్తే క్యాన్సర్‌కు చెక్..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : లింఫోమా అనే తీవ్రమైన రక్త క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, వ్యాధిపై ఉన్న అపోహలు, భయాలను తొలగించడమే దీని ప్రధాన ఉద్దేశం. సకాలంలో వ్యాధిని గుర్తించి, సరైన చికిత్స తీసుకుంటే ఈ క్యాన్సర్ నుంచి కోలుకునే అవకాశాలు మెండుగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?

ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

 

లింఫోమా అంటే ఏమిటి..?

లింఫోమా అనేది శరీర రోగనిరోధక వ్యవస్థలో కీలకమైన 'శోషరస వ్యవస్థ' (Lymphatic System) కణాలపై ప్రభావం చూపే ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. ఇందులో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. హాడ్జికిన్ లింఫోమా (Hodgkin Lymphoma), నాన్-హాడ్జికిన్ లింఫోమా (Non-Hodgkin Lymphoma - NHL). హెమటాలజీ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రెండింటిలో నాన్-హాడ్జికిన్ లింఫోమా కేసులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇందులో మళ్లీ డీఎల్‌బీసీఎల్‌ (DLBCL) అనే రకం అత్యంత సాధారణమైనది.

DLBCL ఎందుకు ప్రమాదకరం..?

డిఫ్యూజ్ లార్జ్ బి-సెల్ లింఫోమా (DLBCL) అనేది నాన్-హాడ్జికిన్ లింఫోమాలో ఒక తీవ్రమైన రకం. ఇది శరీరంలో చాలా వేగంగా వ్యాపిస్తుంది. అయితే, భయపడాల్సిన అవసరం లేదు. ఆధునిక వైద్యంలో దీనికి మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి ఏ దశలో ఉందనే దాన్ని బట్టి 'టార్గెటెడ్ యాంటీబాడీ థెరపీ' వంటి అత్యాధునిక విధానాలతో ప్రారంభ దశలోనే దీన్ని అడ్డుకోవచ్చు.

గమనించాల్సిన ప్రధాన లక్షణాలు..

వ్యక్తిని బట్టి, వ్యాధి రకాన్ని బట్టి లింఫోమా లక్షణాలు.. మారుతుంటా యి. ఈ సంకేతాలు కనిపిస్తే అప్రమత్తం అవ్వాలి.. మెడ, చంకలు లేదా గజ్జల ప్రాంతంలో నొప్పి లేని గడ్డలు ఏర్పడటం అంటే..? లింఫ్ నోడ్స్ వాపు. రోజుల తరబడి జ్వరం తగ్గకపోవడం,రాత్రి సమయంలో విపరీతంగా చెమటలు పట్టడం. ఎలాంటి డైటింగ్ చేయకుండానే అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం. నిరంతర అలసట, నీరసం. చర్మంపై తీవ్రమైన దురద. ఛాతీలో పట్టేసినట్లు ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.