Celebrities’ Fitness Secret : సెలబ్రిటీల ఫిట్‌నెస్ సీక్రెట్.. మన దక్షిణాది ఆహారమే..!
సాక్షి లైఫ్ : రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఇదీ మన దక్షిణాది వంటకాల ప్రత్యేకత. ఒకప్పుడు కేవలం మన ప్రాంతానికే పరిమితమైన ఇడ్లీ, దోశ, ఉప్మా, సాంబార్ లాంటి వంటకాలు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతున్నాయి. కేవలం సామాన్యులే కాదు.. బాలీవుడ్ తారలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు సైతం మన ఆహారాన్ని లొట్టలేసుకుని తింటున్నారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, మాధురీ దీక్షిత్ లాంటి ఫిల్మ్ స్టార్లు.. ముఖేష్ అంబానీ లాంటి కుబేరుల డైనింగ్ టేబుల్ పై కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ నిత్యం కనిపిస్తుంటుంది. ఇందుకు ప్రధాన కారణం కేవలం రుచి మాత్రమే కాదు, అందులో దాగున్న అపారమైన పోషక విలువలే..! నేటి కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే ప్రతి ఒక్కరికీ దక్షిణాది ఆహారం తొలి ఎంపికగా మారుతోంది.
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
మన వంటకాలను సెలబ్రిటీలు ఎందుకంతగా ఇష్టపడతారంటే..
తేలికైన జీర్ణక్రియ: ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటివి పొట్టకు ఎంతో హాయినిస్తాయి. ఇవి జీర్ణం కావడానికి శరీరం ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం ఉండదు. అందుకే ఉదయం అల్పాహారంగానే కాకుండా, రాత్రి పూట డిన్నర్‌కు కూడా ఇవి సరైన ఎంపిక అని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తుంటారు.
క్యాలరీలు, నూనె తక్కువ..
ఫిట్‌నెస్ పట్ల అత్యంత శ్రద్ధ వహించే సెలబ్రిటీలు ఎప్పుడూ తక్కువ నూనె, తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్నే ఎంచుకుంటారు. సాదా దోశ, ఆవిరి మీద ఉడికే ఇడ్లీ, కూరగాయలతో చేసే సాంబార్‌లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
పోషకాలు ఎక్కువ..
బియ్యం, మినప్పప్పు కలయికతో ఇడ్లీ, దోశలను తయారు చేస్తారు. ఇక సాంబార్‌లో కందిపప్పుతో పాటు రకరకాల కూరగాయలు వాడతారు. దీనివల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా అందుతాయి.
పులియబెట్టడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు..
దోశ, ఇడ్లీ పిండిని తయారుచేసే క్రమంలో సహజంగానే పులియబెడతారు. ఇలా పులియబెట్టిన ఆహారం గట్ హెల్త్ అత్యంత మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంచి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ వంటకాలను సరైన మోతాదులో తీసుకుంటే పొట్ట నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. తద్వారా పదే పదే ఆకలి వేయదు. చిరుతిండ్ల వైపు మనసు మళ్లదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.
ప్రతిరోజూ తినొచ్చా..? నిపుణులు ఏమంటున్నారు..?
దక్షిణాది ఆహారాన్ని ప్రతిరోజూ నిస్సందేహంగా తమ డైట్‌లో చేర్చుకోవచ్చని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇడ్లీ, దోశ, సాంబార్ కాంబినేషన్ అనేది కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫైబర్‌ల అద్భుతమైన సమతుల్యతను అందిస్తుంది. పిండిని పులియబెట్టే ప్రక్రియ వల్ల అందులోని పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మరింత మంచిది:
మితంగా తీసుకోవాలి..
అమృతమైనా మితంగానే తీసుకోవాలి. దోశలపై అధికంగా నెయ్యి, వెన్న, నూనె వేసుకుని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వీలైనంత తక్కువ నూనె వాడాలి.
వ్యాధులు ఉన్నవారు..
డయాబెటిస్ లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం బియ్యం మోతాదును తగ్గించి, చిరుధాన్యాలతో చేసిన దోశలు,ఇడ్లీలు తినడం ఉత్తమం. తమ వైద్యుడు లేదా డైటీషియన్ సలహా మేరకు మాత్రమే ఆహార ప్రణాళికను రూపొందించుకోవాలి.
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
