వంట చేసే పద్ధతులు ఆరోగ్యానికి కీలకం: ఈ తప్పులు మీరు చేస్తున్నారా..?

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండటానికి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడమే కాదు, దాన్ని వండే విధానం కూడా చాలా ముఖ్యం. కొన్ని వంట పద్ధతులు ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. అవి ఏంటో, వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. డీప్ ఫ్రై చేసిన ఆహారాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్ ఫ్రైయర్‌లో వంట చేయడం చాలా సాధారణం అయింది. ఎందుకంటే ఇందులో తక్కువ నూనె వాడతారు. అయితే, ఎయిర్ ఫ్రైయర్‌లో వంట చేసినప్పుడు, కొన్ని నూనెలు ట్రాన్స్ ఫ్యాట్స్‌గా మారతాయి, ఇవి ఆరోగ్యానికి మరింత హానికరం. అలాగే, ఎయిర్ ఫ్రైయర్లలో ఆహారం సమానంగా ఉడకదు, కొన్ని భాగాలు సరిగా ఉడకకపోవచ్చు లేదా ఎక్కువగా ఉడకవచ్చు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

గ్రిల్లింగ్ చేయడం వల్ల ఆహారానికి మంచి రుచి వస్తుంది. కానీ, చికెన్ లేదా చేపలను అధిక ఉష్ణోగ్రత వద్ద గ్రిల్ చేసినప్పుడు హెటెరోసైక్లిక్ అమైన్ ,పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ వంటి హానికరమైన పదార్థాలు విడుదల అవుతాయి, ఇవి తీవ్రమైన వ్యాధులకు కారణం కావచ్చు.

నాన్-స్టిక్ పాన్లలో వంట చేయడం సులభం. కానీ అవి ఆరోగ్యకరమైనవి కావు. ఈ పాన్లపై ఉండే టెఫ్లాన్ కోటింగ్ వేడి చేసినప్పుడు లేదా మెటల్ స్పూన్స్ వాడినప్పుడు విషపూరితమైన పొగలు, కణాలు విడుదల అవుతాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. 

మైక్రోవేవ్‌లో ఆహారాన్ని త్వరగా వేడి చేసుకోవచ్చు. కానీ ఇందులో వండినప్పుడు పోషకాలు వేగంగా నశించిపోతాయి. అలాగే, మైక్రోవేవ్‌లో వాడే ప్రత్యేకమైన ప్లాస్టిక్ కంటైనర్ల నుండి రసాయనాలు ఆహారంలోకి విడుదలై ఆహారం పాడైపోతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

వంటకు సరైన పద్ధతులు.. ఈ హానికర పద్ధతులకు బదులుగా, పలు ఆరోగ్యకరమైన పద్ధతులు ఉన్నాయి.. అవేంటంటే..?  

బేకింగ్ (Baking)

రోస్టింగ్ (Roasting)

తక్కువ మంటపై ఉడికించడం (Boiling on low heat)

ఈ విధానాలను పాటించడం వల్ల ఆహారంలోని పోషకాలు నశించకుండా ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన పద్ధతులు మీకు, మీ కుటుంబానికి మంచి ఆహారాన్ని అందించడంలో సహాయపడతాయి.

 

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health cooking-oil junk-food cooking recycled-cooking-oil flour-substitutes-for-cooking cooking-tips cooking-oils grilling-meat high-heat-cooking healthy-cooking-practices unhealthy-cooking-methods cooking-safety
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com