Potato Health risks : బంగాళదుంపలు నిజంగా బరువును పెంచుతాయా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బంగాళాదుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేకరకాల దుష్ప్రభావాలు కలుగుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటిని తినడం వల్ల బరువు పెరుగుతారట. కారణమేమిటంటే..? బంగాళాదుంపలో ఉండే అధిక కేలరీల కంటెంట్ ఊబకాయ సమస్యకు దారితీస్తుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే, బంగాళాదుంప తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అదనంగా బంగాళ దుంపలు రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవాలనుకునేవారు దీనిని తినకపోవడం మేలు. బంగాళాదుంపలు అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది.

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

ఎక్కువగా తింటే..

 బంగాళాదుంపలు ఎక్కువగా తింటే రక్తపోటు సమస్య తలెత్తే ప్రమాదం ఉందట. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి కాల్చిన, లేదా ఉడకబెట్టిన బంగాళాదుంపలు వారానికి నాలుగు సార్లు కంటే ఎక్కువగా తినకూడదని పరిశోధకులు చెబుతున్నారు.

బంగాళాదుంప గ్యాస్ సమస్యలను పెంచుతుందట. అంతేకాకుండా ఈ దుంపలు తింటే ఉబ్బరం, అపానవాయువు సమస్యకు గణనీయంగా దోహదం చేస్తాయని రీసెర్చ్ లో తేలింది. మీరు తరచుగా గ్యాస్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటే, బంగాళాదుంపల వినియోగాన్ని తగ్గించడం లేదా ప్రత్యామ్నాయ ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.