For Healthy Hair : కురుల సంరక్షణకు ఇంట్లోనే సహజసిద్ధమైన 'హెయిర్ రిన్స్'.. తయారీ ఇలా..!
సాక్షి లైఫ్ : జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి, కురులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎప్పుడూ మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులే వాడాల్సిన అవసరం లేదు. మన వంటగదిలో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతోనే జుట్టు సంరక్షణ సులభంగా చేసుకోవచ్చు. బియ్యం, మెంతులు, లవంగాలతో ఇంట్లోనే తయారు చేసుకునే 'హెయిర్ రిన్స్' (Hair Rinse) మీ కేశాలకు ఎంతో మేలు చేస్తుంది. ఎంతో సులువుగా చేసుకోగలిగే ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
కావాల్సిన పదార్థాలు..
నీళ్లు: ఒక కప్పు
బియ్యం: 4 టేబుల్ స్పూన్లు
మెంతులు: 1 లేదా 2 టీస్పూన్లు
లవంగాలు: కొన్ని (4 నుంచి 5)
తయారీ విధానం..?
ముందుగా బియ్యం, మెంతులు, లవంగాలను నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో కప్పు నీళ్లు పోసి, ఈ మూడింటినీ అందులో వేసి రాత్రంతా లేదా కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి.
మరుసటి రోజు ఉదయం అదే నీటితో ఈ మిశ్రమాన్ని సన్నని మంటపై సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తర్వాత స్టవ్ ఆపేసి, మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
బాగా చల్లారిన తర్వాత ఒక శుభ్రమైన వస్త్రం లేదా జల్లెడ సహాయంతో ఆ నీటిని వడకట్టాలి. ఈ నీటిని ఒక శుభ్రమైన స్ప్రే బాటిల్లో నింపుకుంటే మీ హోమ్మేడ్ 'హెయిర్ రిన్స్' సిద్ధమైనట్లే.
ఎలా వాడాలి మరి..?
సాధారణంగా తలస్నానం చేసిన తర్వాత ఈ ద్రావణాన్ని మాడుకు (Scalp), జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు సున్నితంగా అప్లై చేయాలి.
కొద్దిసేపు జుట్టును అలాగే వదిలేసి, ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. మీరు దీన్ని మొదటిసారి వాడుతున్నట్ల యితే, ముందుగా కొద్ది మోతాదులో మాత్రమే రాసి జుట్టుకు పడుతుందో లేదో పరీక్షించుకోండి.
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
