Obesity : 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ముప్పు..
సాక్షి లైఫ్ : భారత్‌లో ఊబకాయం (Obesity) సమస్య నానాటికీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇది కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు.. భవిష్యత్తులో అనేక ప్రాణాంతక వ్యాధులకు దారితీసే ఒక పెద్ద ముప్పుగా మారుతోంది. గంటల తరబడి కూర్చొని పనిచేయడం, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, శారీరక శ్రమ లేకపోవడం వంటి చెడు జీవనశైలి అలవాట్లు భారతీయులను స్థూలకాయుల వైపు నెట్టేస్తున్నాయి.
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఆందోళన రేకెత్తిస్తున్న లాన్సెట్ నివేదిక..
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు భారత్ ఏమాత్రం మినహాయింపు కాదు. 2022లో ప్రచురితమైన 'లాన్సెట్' నివేదిక ప్రకారం.. మన దేశంలో దాదాపు 4.4 కోట్ల మంది మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇదే వేగంతో ఈ సమస్య పెరిగితే, 2050 నాటికి దేశ జనాభాలో దాదాపు మూడో వంతు మంది స్థూలకాయం బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పిల్లలనూ వదలని మహమ్మారి..
స్థూలకాయం ఇప్పుడు పెద్దలకే పరిమితం కాలేదు, పిల్లలు మరియు కౌమారదశలో ఉన్నవారిని కూడా కబళిస్తోంది. వైద్య నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయం ఉన్న పిల్లల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉంది. దేశంలో సుమారు 8.4 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. చిన్న వయసులోనే బరువు పెరగడం వల్ల భవిష్యత్తులో మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉంటుంది.
బరువును నియంత్రించుకోవడానికి ఏం చేయాలి..?
బరువు తగ్గాలంటే కఠినమైన డైటింగ్ చేయాల్సిన పనిలేదు, గంటల తరబడి జిమ్‌లో చెమటోడ్చాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన రోజువారీ అలవాట్లలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సమతుల్య ఆహారం..
ప్లేట్లో ఎప్పుడూ రంగురంగుల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, గుడ్లు ఉండేలా చూసుకోవాలి. తినే పరిమాణం కంటే, తీసుకునే ఆహార నాణ్యతపై ఎక్కువ దృష్టి పెట్టాలి.రోజువారీ శారీరక శ్రమ, వాతావరణాన్ని బట్టి శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది.
వ్యాయామం తప్పనిసరి..
వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. వేగంగా నడవడం, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి బరువు తగ్గడంలో అద్భుతంగా సహాయపడతాయి.
వేటికి దూరంగా ఉండాలి..?
బరువు తగ్గాలని ఒక్కసారిగా భోజనం మానేయడం సరికాదు. దీనివల్ల నీరసం రావడమే కాకుండా, ఆకలి పెరిగిపోయి తర్వాత ఎక్కువగా తినేసే ప్రమాదం ఉంది.
తీపి పానీయాలకు బ్రేక్..
సోడాలు, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌లో చక్కెర, క్యాలరీలు అధికంగా ఉంటాయి. వీటిని పూర్తిగా పక్కన పెట్టేయడం ఉత్తమం. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే చిప్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ వినియోగం తగ్గించాలి.
ఒత్తిడి పెరిగినప్పుడు చాలా మంది స్వీట్లు లేదా ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని లాగించేస్తుంటారు . కాబట్టి ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. నిద్ర సరిగా లేకపోయినా బరువు సులభంగా పెరుగుతారు. కాబట్టి రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర శరీరానికి చాలా అవసరం.
ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
